- డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
సిద్ధిపేట, వెలుగు: కాంగ్రెస్శ్రేణులందరూ కలిసి సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం డీసీసీ ఆఫీస్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ సర్వేపై పార్టీ శ్రేణులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ వార్డు అధికారులతో కలిసి పాల్గొనాలని కోరారు.
ఈ సర్వే స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో కీలక పాత్ర పోషించడమే కాకుండా బీసీ కులాలాల ఆర్థిక స్థితిగతులు, కులవృత్తుల పరిస్థితిని తెలుసుకోవడానికి వీలుపడుతుందన్నారు. గతంలో బీసీ కులగణకు ఎన్నో కమిషన్లు వేసినా ఫలితం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి అమలుచేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జిలు పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.