భార్య, పిల్లలను తుపాకీతో కాల్చి చంపి.. ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్మెన్

భార్య, పిల్లలను తుపాకీతో కాల్చి చంపి.. ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్మెన్

సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ గన్మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నకొడూర్ మండలం రామునిపట్లలో కలెక్టర్ గన్ మెన్ ఆకుల నరేష్ .. తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వార్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. ఆ తర్వాత రివాల్వార్ తో కాల్చుకుని ప్రాణం తీసుకున్నాడు. 

ఆకుల నరేష్.. ప్రస్తుతం కలెక్టర్ వద్ద PSO గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు వారీగా విధులు నిర్వహించుకుని ఇంటికి వచ్చే సమయంలో ఇవాళ ఉదయం (డిసెంబర్ 15న) 9 MM పిస్తోల్ తో భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీలను కాల్చి చంపాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు.

విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్య, పిల్లలను కాల్చి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది..? అసలు కారణాలు ఏంటి...? అనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.