సిద్దిపేట జిల్లా : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటనలో సిద్దిపేట జిల్లా అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దర్శనానికి వెళ్లిన గవర్నర్ తమిళిసై పర్యటనలో జిల్లా కలెక్టర్, ఎస్పీ ఎక్కడా కనిపించలేదు. కొమురవెల్లి టెంపుల్ లో ఆలయ అధికారులు మాత్రమే గవర్నర్ కు స్వాగతం పలికి.. దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ప్రొటోకాల్ అంశంపై మీడియాతో గవర్నర్ మాట్లాడారు. అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడం ఇప్పుడు కొత్తేమీ కాదని.. ఇది అందరికీ తెలిసిన విషయమే అని చెప్పారు.
గతంలో మేడారం సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వెళ్లినప్పుడు కూడా అధికారులు గవర్నర్ పర్యటనలో ప్రొటోకాల్ పాటించలేదు. అంతేకాదు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో వరదలు వచ్చినప్పుడు పర్యటనకు వెళ్లిన సమయంలోనూ ప్రొటోకాల్ పాటించకపోవడం చర్చనీయాంశంగా మారింది.