![నిండు కుండలా రంగనాయక సాగర్.. సిద్దిపేట జిల్లా](https://static.v6velugu.com/uploads/2023/07/Siddipet-District-Ranganayak-Sagar-reservoir_wbfqaZ7jI9.jpg)
సిద్దిపేట, వెలుగు : చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ వద్ద నిర్మించిన రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిండు కుండలా మారింది. కొద్ది రోజులుగా మూడు మోటర్లతో నీటిని ఎత్తి పోస్తుండటంతో పూర్తిస్థాయి నీటిమట్టి 3 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి 2.5 టీఎంసీలకు మించి ఎప్పుడూ నింపలేదు. ఇక్కడి నుంచి మల్లన్న సాగర్ రిజర్వాయర్ కు నీటిని తరలించడంతో పాటు సిద్దిపేట, సిరిసిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గాల పరిధిలోని చెరువులకు నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ కింద సిద్దిపేట నియోజకవర్గంలో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది.