
మంత్రి హరీశ్ రావును ఆదర్శంగా తీసుకుని యువత ప్రజా సేవ చేయాలన్నారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి సర్పంచ్ బోయినపల్లి నర్సింగరావు. తోటపల్లి గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు తన సొంత డబ్బులు రూ.45 వేలతో ఉచితంగా గొడుగులు పంపిణి చేశారు. హరీశ్ రావు స్ఫూర్తితోనే తాను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా THR(తన్నీరు హరీశ్ రావు ) అనే పదాలను గొడుగులతో ప్రదర్శించి తన అభిమానాన్ని చాటుకున్నారు. హరీశ్ రావు గొప్పతనం గురించి తెలియజేస్తూ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఇపుడు సోషల్ మీడియాలో వైరలో అవుతోంది.
Siddipet district Thotapalli Sarpanch Narsing rao service programs with own money pic.twitter.com/IJyuRQlxyD
— Prashanth (@itzmibadboi) August 27, 2023
హరీశ్ రావు స్ఫూర్తితో గతంలో ఇలాంటి కార్యక్రమాలెన్నో చేశామన్నారు తోటపల్లి సర్పంచ్ నర్సింగరావు. హరీశ్ రావు తోటపల్లిలో పుట్టడం గ్రామ ప్రజల అదృష్టమని చెప్పారు. తమ గ్రామంలో పుట్టిన మంత్రి హరీశ్ రావును స్పూర్తిగా తీసుకుని ఎలాంటి సేవా కార్యక్రమాలైనా చేయాలనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి నల్లగొండ లక్ష్మి, తోటపల్లి ఉప సర్పంచ్ఎంబరి మమతపలువురు పాల్గొన్నారు.