
- ఇరిగేషన్ ఆఫీసర్లు,
- పోలీసుల హామీతో విరమణ
- సిద్దిపేట రూరల్ మండలం
సిద్దిపేట రూరల్, వెలుగు: తమ పొలాలకు నీరు రాకుండా రెండు గ్రామాల రైతులు అడ్డుకట్ట వేశారని ఆరోపిస్తూ సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ రైతులు మంగళవారం ముస్తాబాద్ రహదారిపై ధర్నా చేశారు. తమ పంటలకు నీరు రానివ్వకుండా కాల్వకు అడ్డుకట్టవేశారంటూ నారాయణరావుపేట మండలం కోదండరా వుపల్లి, బంజరుపల్లి రైతులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం మాచాపూర్ రైతులు మాట్లాడుతూ తమకు నీళ్లు రాకుండా రంగనాయక సాగర్ కెనాల్ కు కోదండరావుపల్లి, బంజరుపల్లి రైతులు అడ్డుకట్ట వేశారని, వెంటనే తొలగించాలని కోరారు.
నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని మాచాపూర్ వాపోయారు. మూడు గ్రామాల రైతు ల ఆందోళన గురించి తెలియడంతో సిద్దిపేట రూర ల్ ఇరిగేషన్ డీఈ విద్యాసాగర్, రూరల్ సీఐ శీను, ఎస్ఐ అపూర్వరెడ్డి అక్కడికి వెళ్లి మాట్లాడి నచ్చజెప్పారు. ఒకటి రెండు రోజుల్లోగా మాచాపూర్ గ్రామానికి నీళ్లు వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.