317 జీవో రద్దు చేయాలంటూ టీచర్ల వినూత్న నిరసనలు

317 జీవో రద్దు చేయాలంటూ టీచర్ల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. భోగి పండగ సందర్భంగా సిద్దిపేట జిల్లాలో ఇంటి ముందు ముగ్గులతో నిరసనలు తెలిపారు ఉద్యోగులు. రంగులు లేని సంక్రాంతి మా కొద్దు... దంపతులను విడదీయవద్దు అంటూ ముగ్గులు వేసి నిరసన తెలిపారు. వెంటనే 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.