బాడీ బిల్డింగ్ పోటీలు

సిద్దిపేట, వెలుగు: జిల్లా బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్  పోటీలు శనివారం రాత్రి సిద్దిపేటలో జరిగాయి. మొత్తం 4 కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో 30 మంది బాడీ బిల్డర్స్ పాల్గొన్నారు. 55 కేజీల విభాగంలో ప్రథమ బహుమతి మనోజ్, ద్వితీయ నవాజ్, తృతీయ దుర్గ ప్రసాద్,  60 కేజీల విభాగంలో ప్రథమ బహుమతి మణికంఠ, ద్వితీయ జి.షాన్, తృతీయ వంశీ, 65 కేజీల విభాగంలో ప్రథమ బహుమతి ఎస్.కె చైబు, ద్వితీయ రోడ్నిష్,  తృతీయ అర్జున్, 70 కేజీల విభాగంలో ప్రథమ బహుమతి ఆసిఫ్, ద్వితీయ భగత్, తృతీయ సాయి కృష్ణ, 75 కేజీల విభాగంలో  ప్రథమ బహుమతి దేవేందర్,  ద్వితీయ నరేశ్ గెలుపొందారు. విజేతలకు అమిత్ శెట్టి భాస్కర్ బహుమతులను అందజేశారు. కౌన్సిలర్లు ధర్మవరం బ్రహ్మం, వినోద్ గౌడ్, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి,  ప్రధాన కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు.