సిద్దిపేట, హుస్నాబాద్, తూప్రాన్, వెలుగు: స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన చేంజ్ మేకర్స్ కాన్క్లేవ్ లో సిద్దిపేట, హుస్నాబాద్, తూప్రాన్మున్సిపాలిటీలకు చేంజ్మేకర్స్అవార్డు దక్కింది.
గురువారం కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌజింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్, హుస్నాబాద్ మున్సిపాలిటీ పర్యావరణ ఇంజనీర్ రవికుమార్, తూప్రాన్మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేశ్ రెడ్డి అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆయా మునిసిపాలిటీలలో వేస్ట్మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నారో వెల్లడించారు.