
సిద్దిపేట రూరల్, వెలుగు: అభివృద్ధి పేరుతో సిద్దిపేటను 40 ఏళ్లుగా మామ, అల్లుళ్లు దోచుకున్నారని నియోజవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి హరికృష్ణ ఆరోపించారు. బుధవారం ఆయన సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి పరిధిలోని రామచంద్ర నగర్ లో రూ.20 లక్షలతో సీసీరోడ్లు, రూ.3 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో బోర్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని, గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.
.పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. పథకాలకు ఆకర్షితులైన ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు. అంతకుముందు పలువురు వ్యక్తులు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాదగిరి, కలీముద్దీన్, షాబుద్దీన్, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, ఉపాధ్యక్షులు పాండు, గ్రామ అధ్యక్షులు బాలయ్య, నాయకులు కనకయ్య, సిద్దన్న, రేణుక, నర్సింలు, జీపీ సెక్రటరీ మమత పాల్గొన్నారు.