భార్య కాపురానికి రావట్లేదని వాటర్ ట్యాంక్ పై నుంచి దూకాడు

భార్య కాపురానికి రావట్లేదని వాటర్ ట్యాంక్ పై నుంచి దూకాడు

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామంలో ఓ యువకుడు వాటర్ ట్యాంక్ పైనుంచి దూకాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లారు. యదగిరి అనే యువకుడు తన భార్య కాపురానికి రావటం లేదని వాటర్ ట్యాంకు పైకి ఎక్కి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. అప్పటికే పోలీసులు వచ్చి యాదగిరికి ఎంత నచ్చచెప్పినా అతను వినిపించుకోలేదు. తన భార్య కాపురానికి రావటం లేదని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. యాదగిరి వాటర్ ట్యాంక్ పై నుంచి దూకడంతో స్థానికులు భయపడ్డారు. వాటర్ ట్యాంక్ పై నుంచి దూకడంతో యాదగిరికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అతన్ని స్థానికి గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమొదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.