- సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్
సిద్దిపేట టౌన్, వెలుగు: కొత్త స్కీముల అమలులో వార్డు ఆఫీసర్లు, మెప్మా సిబ్బంది పకడ్బందీగా వ్యవహరించాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ అన్నారు. బుధవారం సిద్దిపేట మున్సిపల్ ఆఫీసులో ఆయన వార్డు ఆఫీసర్లు, మెప్మా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 26 నుంచి కొత్త స్కీములను ప్రభుత్వం ప్రారంభించనున్న నేపథ్యంలో, వాటి అమలులో జాగ్రత్త వహించాలని చెప్పారు. రైతు భరోసా పథకంలో భూభారతి పోర్టల్ లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూముల విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా అందుతుందని చెప్పారు.
కొత్త రేషన్ కార్డుల జారీకి సీప్ సర్వే ఆధారంగా ఆన్లైన్ డేటా ప్రకారం రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితా క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపిస్తామని చెప్పారు. ముసాయిదా జాబితాను వార్డు సభలో ప్రదర్శించి, వార్డు సభల ద్వారా ఆమోదించిన లబ్ధిదారుల జాబితాను ఆ తయారు చేస్తామన్నారు. ఆహార భద్రత కార్డుల్లో సభ్యుల మార్పులు, చేర్పులు, తొలగింపులు చేయాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులరీవెరిఫికేషన్ ప్రక్రియను వివరించారు.