సిద్దిపేట టౌన్, వెలుగు: బ్యాంకులు లింకేజ్ ల టార్గెట్లను త్వరగా పూర్తి చేయాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన ఆధ్వర్యంలో టౌన్ లెవెల్ బ్యాంకర్స్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు లింకేజీలకు సంబంధించిన టార్గెట్లను ఫిబ్రవరి నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హత గల సభ్యులకి పీఎం స్వానిధి లోన్ డాక్యుమెంటేషన్ చేయాలని ఆదేశించారు.
మహిళా శక్తి ద్వారా లోన్లు ఎస్ఎస్జీ మహిళలకు అధికంగా అందాయని, మహిళలు ఆర్థికంగా మరింతగా ఎదిగేందుకు పెద్ద ప్రాజెక్టులుగా క్యాంటీన్ బస్సులను పెట్టవచ్చని, అందుకు ఆర్టీసీ వారు బస్సులను సైతం ఇస్తారన్నారు. అందుకు కావలసినటువంటి డబ్బులను ఎస్ఎస్జీ సభ్యులు సర్దుబాటు చేసుకోవాలని, బ్యాంకుల నుంచి కొంత మొత్తం రుణాలు బ్యాంకు వారు ఇస్తారని తెలిపారు. మార్చి 31 వరకు తప్పనిసరిగా వంద శాతం ఇంటి పన్నువసూలు పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు. సమావేశంలో అధికారులు ప్రేరణ, శ్రీనాథ్, హనుమంత్ రెడ్డి, వెంకట్రావు, శ్రీకాంత్, బాలకృష్ణ, అజ్మత్ అలీ, సంతోషి, సాయి కృష్ణ, రమ్య, జ్యోతి పాల్గొన్నారు.