సిద్దిపేట సీపీ, మెదక్ ఎస్పీ ట్రాన్స్ ఫర్

సిద్దిపేట సీపీ, మెదక్ ఎస్పీ ట్రాన్స్ ఫర్

సిద్దిపేట, మెదక్, వెలుగు:  సిద్దిపేట పోలీస్ కమిషనర్, మెదక్ ఎస్పీలను ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. సిద్దిపేట సీపీ ఎన్.శ్వేత హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఆమె 2021 డిసెంబర్ 27న సిద్దిపేట సీపీగా బాధ్యతలు స్వీకరించారు.

దాదాపు రెండు సంవత్సరాల కాలం  ఇక్కడ పనిచేసిన  శ్వేత విధి నిర్వహణలో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా  విద్యార్థులతో ఇంట్రాక్షన్ కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించారు. మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఇక్కడి నుంచి ట్రాన్స్ ఫర్ చేసి హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

2021 డిసెంబర్ 26వ తేదీన మెదక్ జిల్లా ఎస్పీగా నియమితులైన ఆమె దాదాపు రెండేళ్ల పాటు ఇక్కడ పని చేశారు. రోహిణి ప్రియదర్శిని పని చేసిన కాలంలో టేక్మాల్ మండలంలో జరిగిన మిస్టరీ మర్డర్ కేసు, కొల్చారం మండలం పైతరలో జరిగిన భార్య భర్తల హత్య కేసు, ఏడుపాయల్లో జరిగిన మర్డర్ కేసును, ఆలయంలో జరిగిన దొంగతనం కేసులను తొందరగా చేధించారు.