
సిద్దిపేట, వెలుగు: మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీబీఎఫ్జాతీయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిండం తగదన్నారు. సర్వం కోల్పోయిన నిర్వాసితులను ప్రత్యేక కేటగిరి కింద గుర్తించి ఇందిరమ్మ అత్మీయ భరోసా పథకాన్ని వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ ఆఫీసులో వినతిపత్రం సమర్పించారు.