క్యూఆర్ కోడ్ తో ఫీడ్ బ్యాక్ సేకరణ

  • సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు దారుల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నట్లు సీపీ అనురాధ తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ ను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని పీఎస్​కు వచ్చే ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల అభిప్రాయ సేకరణ బట్టి మరిన్ని సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని సీపీ తెలిపారు.