సెల్​ఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్​

సెల్​ఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్​

కొమురవెల్లి, వెలుగు: సెల్​ఫోన్​ కొనివ్వలేదని యువకుడు సూసైడ్​ చేసుకున్నాడు.  కర్జీది గ్రామానికి చెందిన రూపేశ్ (18) కుటుంబసభ్యులు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలో మేస్త్రీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. సో మవారం రూపేశ్​ తనకు సెల్​ఫోన్​ కొనివ్వాలని కుటుంబసభ్యులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొమురవెల్లి మండలం గౌరాయపల్లి సమీపంలో రైల్వే ట్రాక్​పై శవమై కనిపించాడు. రూపేశ్​ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.