
సిద్దిపేటకు జాతీయస్థాయి అవార్డు రావడం పట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు ఎంతో గర్వకారణమని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సిద్దిపేట దక్షిణ భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు.
చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణలో సిద్దిపేట చేపట్టిన వినూత్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఎంతో గొప్ప సహకారం అందించిన పట్టణ ప్రజలు, కృషి చేసిన కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా హరీష్ రావు అభినందనలు తెలిపారు.
జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటిన మన సిద్దిపేట.
— Harish Rao Thanneeru (@BRSHarish) January 5, 2024
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దక్షిణ భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచింది. చెత్త సేకరణ, పారిశుద్ధ నిర్వహణల్లో సిద్దిపేట చేపట్టిన వినూత్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సిద్దిపేటకు జాతీయ స్థాయి అవార్డు రావడం ఎంతో గర్వకారణం. ఈ దిశగా… pic.twitter.com/uWFyc1ijlJ