Jack Teaser: సిద్దు జొన్నలగడ్డ జాక్ టీజర్ రిలీజ్... గలీజ్ జాబ్ చేస్తున్నాడా..?

Jack Teaser: సిద్దు జొన్నలగడ్డ జాక్ టీజర్ రిలీజ్... గలీజ్ జాబ్ చేస్తున్నాడా..?

డీజే టిల్లు మూవీ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా జాక్.. ఈ సినిమాలో సిద్ధుకి జంటగా బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తోంది. లవ్ & ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలకి పెట్టింది పేరైన ప్రముఖ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత కొల్ల అవినాష్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మస్తున్నాడు. శుక్రవారం సిద్దు జొన్నలగడ్డ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా టీజర్ ని మేకర్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ టీజర్ విశేషాలేంటో చూద్దాం.

అయితే హీరో సిద్దు జొన్నలగడ్డ జాక్ అనే యువకుడి పాత్రలో నటించాడు. జాక్ ఎలాంటి జాబ్ చెయ్యకుండా బైకులు, పర్సులు దొంగతనం చేస్తుంటాడు. దీంతో తన తండ్రి (నరేశ్)కి తలా నొప్పిగా మారుతాడు.. ఈ క్రమంలో అనుకోకుండా హీరోయిన్ వైష్ణవి చైతన్యని కలుస్తాడు.. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక షబీర్ కల్లరక్కల్ విలన్ గా నటించాడు. అయితే హీరోకి, విలన్ కి మధ్య పెద్దగా సన్నివేశాలు, డైలాగులు లేవు.. కానీ సిద్దు అండర్ కవర్ ఏజెంట్ పాత్రని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చివరిలో కొన్ని యాక్షన్ సీన్స్ తోపాటు వైష్ణవి చైతన్య నాకో లవ్ స్టోరీ ఉందని క్యూట్ చెప్పే డైలాగుతో టీజర్ ఎండ్ అవుతోంది.

ALSO READ | మహా కుంభమేళా.. సన్యాసం పుచ్చుకున్న మాజీ మిస్ ఇండియా

ఓవరాల్ గా చూస్తే ఎటువంటి గందరగోళం లేకుండా సింపుల్ గా టీజర్ ని కట్ చేశారు. ముఖ్యంగా సిద్దు లుక్స్ హైలెట్ అని చెప్పవచ్చు. డీజే టిల్లులో కర్లీ హెయిర్ తో లోకల్ బాయ్ లుక్ లో కనిపించిన సిద్దు... జాక్ లో డీసెంట్ లుక్ లో కనిపించాడు. ఇక వైష్ణవి చైతన్య కూడా యాక్టింగ్ పర్వాలేదనిపించింది. ఇక సీనియర్ నరేష్, బ్రహ్మజీ కామెడీ ఆకట్టుకున్నాయి.