టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ గా శాకుంతలం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో తన తరువాత సినిమా ఖుషీపై ఫుల్ ఫోకస్ పెట్టింది. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ సినిమాను క్లాస్ సినిమాల దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది.
అయితే.. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మరో మూవీకి ఒకే చెప్పేసిందట ఈ సమంత. తాజాగా దర్శకురాలు నందినీ రెడ్డి చెప్పిన కథ సామ్ కు బాగా నచ్చిందట. అందుకే వెంటనే ఓకే చెప్పేసిందట. ఇక ఈ సినిమాలో మేల్ లీడ్ క్యారెక్టర్ కోసం యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డను ఫిక్స్ చేశారట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుంది. ప్రస్తుతం సిద్దు.. డీజే టిల్లు 2 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినా వెంటనే.. నందినీ రెడ్డి, సమతల ప్రాజెక్ట్ మొదలుపెట్టనున్నాడు సిద్దు.
ఇక నందినీ రెడ్డి, సమంతల కాంబోలో ఇప్పటికే ఓహ్ బేబీ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అయ్యింది. ఓహ్ బేబీ తరహాలోనే ఈ కొత్త సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని సామ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు