
‘టిల్లు స్క్వేర్’ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ ‘జాక్’(JACK).బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. సిద్ధుకి జంటగా వైష్ణవి చైతన్య నటించింది.
2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన్న ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. స్పై యాక్షన్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్ ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. ఈ సినిమాతో సిద్ధుకి హ్యాట్రిక్ హిట్ మిస్ అవ్వడంతోపాటు భారీ ఫెయిల్యూర్ ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో జాక్ మూవీ నెల తిరగకుండానే ఓటీటీలోకి రాబోతుందని సమాచారం.
జాక్ ఓటీటీ:
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. జాక్ మూవీ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రానున్నట్టు తెలుస్తోంది. మే 1నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు రానుందని టాక్. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. రానున్న ఈ రెండ్రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
జాక్ బడ్జెట్:
అయితే, ఈ మూవీ రూ.18 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. (ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ: 16 కోట్ల గ్రాస్, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 2 కోట్ల గ్రాస్) దాంతో రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు తో బరిలో దిగి.. కేవలం రూ.10 కోట్ల లోపే వసూళ్లు రాబట్టి నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది.
ఇకపోతే, జాక్ మూవీ ప్రమోషన్ ఖర్చుతో కలిపి మొత్తం రూ.35 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడింది. ఇండియా వైడ్ గా ఈ మూవీ రెండు వారాల్లో రూ.7.86 కోట్ల షేర్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక రూ.9.27 కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం.