![ఐదేళ్ల తర్వాత బిగ్ స్క్రీన్స్ లో కృష్ణ అండ్ హిస్ లీల మూవీ : సిద్ధు జొన్నలగడ్డ](https://static.v6velugu.com/uploads/2025/02/siddu-jonnalagadda-speech-at-krishna-and-his-leela-movie-press-meet_mxpPbJyXnM.jpg)
తన కెరీర్‌లో ‘కృష్ణ అండ్ హిస్ లీల’ చాలా స్పెషల్ మూవీ అని చెప్పాడు సిద్ధు జొన్నలగడ్డ. ఐదేళ్ల క్రితం కరోనా టైమ్‌లో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రాన్ని ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ టైటిల్‌తో ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. రవికాంత్ పెరేపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్ హీరోయిన్స్‌గా నటించారు. కొత్త టైటిల్‌తో థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని పాండమిక్ కారణంగా థియేటర్లలో విడుదల చేయలేకపోయామన్న బాధ నాకు, రవికాంత్‌కు ఎప్పుడూ ఉండేది.
ఇప్పుడు రానా సపోర్ట్‌తో థియేటర్స్‌కు రావడం హ్యాపీగా ఉంది. ఈ మూవీ జర్నీలో నటుడిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నా. థియేటర్స్‌లో ఆడియెన్స్ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నా’ అని చెప్పాడు. రానా మాట్లాడుతూ ‘అందరి జీవితంలో జరిగే కథ ఇది. థీమ్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది’ అని అన్నాడు. ఇది తమకు బిగ్ మూమెంట్ అని, ఈ చిత్రం ఐదేళ్ల తర్వాత థియేటర్స్‌లో రిలీజ్ కావడం ఎక్సయిటింగ్‌గా ఉందని హీరోయిన్స్ శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, దర్శకుడు రవికాంత్ అన్నారు.