భీమవరం విష్ణు కాలేజీలో సందడి చేసిన జాక్ మూవీ టీమ్

భీమవరం విష్ణు కాలేజీలో సందడి చేసిన జాక్ మూవీ టీమ్

సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా ‘బొమ్మరిల్లు భాస్కర్’ రూపొందించిన  చిత్రం ‘జాక్’.    బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా  ఏప్రిల్ 10న విడుదల కానుంది.  ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై  అంచనాలు  పెంచాయి. తాజాగా  ప్రమోషన్స్‌‌లో భాగంగా శనివారం భీమవరంలోని విష్ణు కాలేజీలో టీమ్ సందడి చేసింది. ఈ సందర్భంగా  సిద్ధు మాట్లాడుతూ ‘కాలేజ్ లైఫ్ ఎంతో అందంగా ఉంటుంది. ఈ  టైం మళ్లీ రాదు. 

ఎంజాయ్ చేయండి. స్టూడెంట్స్  ఎనర్జీ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ‘జాక్’ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని చెప్పాడు.  వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ‘ఈ సినిమా చాలా ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా ఉంటుంది. సిద్ధు టాలెంటెడ్ పర్సన్. తనతో  వర్క్ చేయడం వెరీ హ్యాపీ’ అని చెప్పింది.  నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ‘ సిద్ధు ఆల్ రౌండర్. సినిమా అవుట్‌‌పుట్ చాలా బాగా వచ్చింది. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని అన్నారు.