KiaraAdvani: గుడ్‌ న్యూస్‌ చెప్పిన బాలీవుడ్ లవ్ కపూల్.. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్తో కియారా పోస్ట్

KiaraAdvani: గుడ్‌ న్యూస్‌ చెప్పిన బాలీవుడ్ లవ్ కపూల్.. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్తో కియారా పోస్ట్

బాలీవుడ్ లవ్ కపూల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంట గుడ్ న్యూస్ చెప్పారు. 2023లో వివాహ బంధంతో ఒక్కటయ్యిన ఈ జంట త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఇన్ డైరెక్ట్గా వెల్లడించారు.

కియారా ఫిబ్రవరి 28న తన ఇన్‌స్టాలో బేబీ సాక్స్‌ను చేతుల్లో పట్టుకున్న ఫొటోను షేర్‌ చేసింది. అలాగే ‘‘మా జీవితానికి సంబంధించిన అద్భుతమైన బహుమతి త్వరలో రానుంది’’ అంటూ ఇంట్రెసింగ్ క్యాప్షన్ ఇచ్చింది.

ఇక ఈ గుడ్ న్యూస్ తెలిసాక సినీ సెలబ్రేటీలు, తమ ఫ్యాన్స్ సిద్ధార్థ్, కియారాలకు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read:-ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో వస్తోన్న హీరో శ్రీ విష్ణు..

ఇకపోతే 2023 ఏడాదిలో రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని సూర్యఘడ్ ప్యాలెస్‌లో వీరి వివాహా వేడుక అత్యంత ఘనంగా జరిగింది. 2021లో విడుదలైన షేర్షా షూటింగ్ టైమ్ లో సిద్ధార్థ్, కియారా ప్రేమలో పడ్డారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

సౌత్​..నార్త్ అనే తేడా లేకుండా కియారా అద్వానీ ఆఫర్లు పట్టేస్తోంది. భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీకి  పరిచయమయింది. ఇటీవలే రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలో మెరిసింది.