‘టిల్లు స్క్వేర్’ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నుంచి రాబోతున్న చిత్రం ‘జాక్’. కొంచెం క్రాక్ అనేది ట్యాగ్‌లైన్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సిద్ధుకి జంటగా వైష్ణవి చైతన్య నటిస్తోంది. ఇప్పటికే 80 శాతంకు పైగా షూటింగ్ పూర్తయింది. బుధవారం ఈ చిత్రానికి సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో సిద్ధు పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోందని చెప్పారు. ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషిస్తుండగా, అచ్చు రాజమణి సంగీతాన్ని అందిస్తున్నాడు.