ఎడపల్లి మండలంలో ఇసుక టిప్పర్ల పట్టివేత

ఎడపల్లి మండలంలో ఇసుక టిప్పర్ల పట్టివేత

ఎడపల్లి, వెలుగు : ఎడపల్లి మండలంలోని సాటాపూర్​గేట్ గుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు టిప్పర్లను శుక్రవారం సీజ్​ చేసినట్టు ఎడపల్లి ఎస్‌‌‌‌‌‌‌‌ఐ వంశీ కృష్ణారెడ్డి తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తుండడంతో వీటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.