సిఫ్ట్‌‌‌‌కు గోల్డ్‌‌‌‌, ఇషాకు సిల్వర్‌‌‌‌‌‌‌‌

సిఫ్ట్‌‌‌‌కు గోల్డ్‌‌‌‌,  ఇషాకు సిల్వర్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌‌‌ షూటర్లు సిఫ్ట్‌‌‌‌ కౌర్‌‌‌‌ సమ్రా, ఇషా సింగ్‌‌‌‌.. ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌, సిల్వర్ మెడల్స్‌‌‌‌తో మెరిశారు. అర్జెంటీనాలోని బ్యూనస్‌‌‌‌ ఎయిర్స్‌‌‌‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన విమెన్స్‌‌‌‌ 50 మీటర్ల రైఫిల్‌‌‌‌ త్రీ పొజిషన్‌‌‌‌లో సిఫ్ట్‌‌‌‌ 458.6 పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచింది. తన వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ కెరీర్‌‌‌‌లో ఇదే వ్యక్తిగత గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ కావడం విశేషం. 

విమెన్స్‌‌‌‌ 25 మీటర్ల పిస్టల్‌‌‌‌లో హైదరాబాదీ ఇషా సిల్వర్ నెగ్గింది. ఫైనల్లో ఇషా 35 పాయింట్లతో రెండో స్థానం సాధించింది. వరల్డ్ కప్‌లో ఇషాకు ఇది రెండో మెడల్‌. మను భాకర్ 20 పాయింట్లతో ఆరో ప్లేస్‌‌‌‌తో సరిపెట్టింది.  విమెన్స్‌‌‌‌ స్కీట్‌‌‌‌లో రైజా దిల్లాన్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ రేసులో నిలిచింది. క్వాలిఫికేషన్‌‌‌‌ తొలి నాలుగు రౌండ్లలో 94 పాయింట్లతో ఆరో ప్లేస్‌‌‌‌లో నిలిచింది. గనేమత్‌‌‌‌ సెకోన్‌‌‌‌ (92), దర్శన్‌‌‌‌ రాథోడ్‌ (89) వరుసగా 11, 18వ స్థానంలో ఉన్నారు.