సంతకం పెడతారా.. జైలుకెళ్తారా..? గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ను టార్గెట్ చేసిన అమెరికా..

సంతకం పెడతారా.. జైలుకెళ్తారా..? గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ను టార్గెట్ చేసిన అమెరికా..

డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాక అమెరికాలో ఉన్న వలసదారులకు చుక్కలు చూపిస్తున్నారు.అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్.. ఆ దిశగా వేగంగా అడుగులేస్తున్నారు. అక్రమ వలసదారులను యుద్ధప్రాతిపదికన తరిమేసిన ట్రంప్ ఇప్పుడు సీనియర్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు గ్రీన్ కార్డు హోల్డర్స్ పై గట్టి నిఘా పెట్టారు. ముఖ్యంగా ఇండియన్స్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గ్రీన్ కార్డులను అయిర్పోర్టులో సబ్మిట్ చేసి వెళ్లాలంటూ ఆంక్షలు విధిస్తున్నట్లు సమాచారం.

Also Read:-అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి..

ఎయిర్పోర్టులో గ్రీన్ కార్డులు సబ్మిట్ చేయకపోతే రాత్రంతా ఎయిర్పోర్టులోనే నిర్బంధిస్తున్నట్లు సమాచారం.అయితే.. గ్రీన్ కార్డు హోల్డర్స్ ని నిర్బందించే అధికారం ఎయిర్పోర్టు అధికారులకు లేదని.. ఈ అంశంపై కోర్టుకెళ్లే హక్కు గ్రీన్ కార్డు హోల్డర్స్ కి ఉందని.. ఇండియన్ ఎంబసీ అధికారులు అంటున్నారు. అమెరికా అధికారుల బెదిరింపులకు భయపడొద్దని.. గ్రీన్ కార్డులు ఎయిర్పోర్టులో సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.