
హైదరాబాద్, వెలుగు : ఉత్తర భారతదేశంలోని రియల్టీ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించిన గురుగ్రామ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ సిగ్నేచర్ గ్లోబల్ ఏసీసీకి భారీ కాంట్రాక్టు ఇచ్చింది. తమ అన్ని టవర్లు, బేస్‌మెంట్లు, ఇతర నిర్మాణ పనుల కోసం ఏసీసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను నియమించింది.
సెప్టెంబర్ 12, 2024 నాటి ఎల్ఓఐ మొత్తం కాంట్రాక్ట్ విలువ రూ. 320 కోట్లు. పని ప్రారంభించిన తేదీ నుంచి 27 నెలల్లో పూర్తి కావాలి. అదనంగా మూడు నెలల గడువు ఇస్తామని సిగ్నేచర్ గ్లోబల్ వైస్ చైర్మన్ లలిత్ అగర్వాల్ చెప్పారు.