
న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10వేల కోట్ల సేల్స్ టార్గెట్ను అధిగమించే అవకాశం ఉందని చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ తెలిపారు. ప్రాపర్టీ మార్కెట్‌లో బలమైన హౌసింగ్ డిమాండ్ ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో కంపెనీ రూ.5,900 కోట్ల విలువైన బుకింగ్‌లను సాధించిందని ఆయన చెప్పారు. ఇంతటి భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న అతి కొద్ది లిస్టెడ్ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో తాము కూడా ఉన్నామని అన్నారు.