తహసీల్దార్ సంతకం ఫోర్జరీ

తహసీల్దార్  సంతకం ఫోర్జరీ

లింగాల, వెలుగు: మండలంలోని దారారం గ్రామంలో ఆర్డీటీ సంస్థ ఆధ్యర్యంలో నిర్మించే ఇండ్ల కోసం తహసీల్దార్  సంతకం ఫోర్జరీ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని పలు గ్రామాల్లో రూరల్  డెవలప్ మెంట్  ట్రస్ట్(ఆర్డీటీ) ఆధ్వర్యంలో చెంచులతో పాటు ఎస్సీలకు ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టారు.

మండలంలోని దారారంలో చెంచులతో పాటు 12 మంది ఎస్సీలకు ఇండ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన లబ్ధిదారులు తహసీల్దార్  నుంచి ఇంటి జాగకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం తీసుకొని, ఆర్డీటీ ప్రతినిధులకు అందించాలి. అయితే కొందరు ఈ పత్రాలపై తహసీల్దార్  సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆర్డీటీ ప్రతినిధులకు అందించినట్లు ఆరోపణలు వచ్చాయి.

దీంతో తమకు లబ్ధిదారులు అందజేసిన పత్రాలను పరిశీలన నిమిత్తం తహసీల్దార్ కు పంపించారు. ఈ విషయంపై ఆర్డీటీ ఏరియా టీం లీడర్  రాధను వివరణ కోరగా, ఎస్సీలకు ఇండ్ల నిర్మించాలనే ప్రపోజల్స్​ పెండింగ్​లో ఉన్నట్లు తెలిపారు.