
వివిధ రంగాలలో మహిళల విజయాలను గుర్తించడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ( మార్చి 8) నిర్వహించుకుంటాము. మహిళా దినోత్సవం ఎప్పుడు, దీని చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. .
మహిళా దినోత్సవం ( మార్చి 8) నిర్వహణ వెనుక చాలా చరిత్ర ఉంది. చాలా దేశాల్లో మహిళలు నిర్వహించిన నిరసన ప్రదర్శనలు, చేసిన ఉద్యమాలు మార్చి 8వ తేదీతో ముడిపడి ఉండటం ఇందుకు కారణం. 1908 మార్చి 8న న్యూయార్క్ లోని ఓ దుస్తుల కంపెనీలో పని చేసే పదిహేను వేల మంది మహిళా వర్కర్స్ తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కి పోరాడి విజయం సాధించారు. ఈ విజయాన్ని స్మరించుకుంటూ ఆ మరుసటి ఏడాదిలో సోషలిస్ట్ పార్టీ ఫిబ్రవరి 28వ తేదీని అమెరికా జాతీయ మహిళా దినోత్స వం నిర్వహించింది.
1910లో డెన్మార్క్ లోని కోపెన్హా గెన్లో లో పదిహేడు దేశాల నుంచి వంద మంది మహిళా ప్రతినిధులు హాజరై ప్రతీ ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించాలని ఒక తీర్మానం చేశారు. అయితే ఒక ప్రత్యేకమైన తేదీ అంటూ నిర్ణయించకపోవడంతో మహిళా దినోత్సవాన్ని కొన్ని దేశాలు వేర్వేరు తేదీల్లోని ర్వహించుకుంటూ వచ్చాయి. చివరకు ఐక్యరాజ్య సమితి 1975 ఏడాదిని అంతర్జాతీయ మహిళా ఏడాదిగా.. మార్చి 8వ తేదీని ...అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది.
ఆ తరువాత ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1977లో ఉమెన్స్ డేను ...మహిళల హక్కు-ప్రపంచ శాంతి... దినోత్సవంగా
జరుపుకోవాలని తీర్మానం చేసింది. అప్పటి నుంచి పలు దేశాలు మార్చి 8న విమెన్స్ డేను నిర్వహిస్తున్నాయి. అయితే కొన్ని దేశాలు మహిళా దినోత్సవం జరుపుకునే తీరులో వైవిధ్యం ఉంటుంది. హక్కుల సాధనకై కొన్ని చోట్ల మహిళలు ఇంకా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నా రు. మరికొన్నిచోట్ల మహిళా విజయానికి సంకేతంగా వేడుకలను నిర్వహిస్తుంటారు.
ALSO READ : ఈ ఏడాది (2025) అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ఇదే..!
ఒక పుట్టుకకూ, ఒక అస్తిత్వానికి, ఒక పునరుజ్జీవానికీ, ఒక కొనసాగింపుకూ గౌరవం ఇచ్చే రోజు మహిళా దినోత్సవం, మనిషి మనుగడ కోసం పురుషుడితో సమానంగా స్త్రీ అవసరాన్ని, వాళ్లహక్కులను గుర్తు చేసుకునే రోజు. కానీ, ప్రస్తుతం .. ప్రధాన ఉద్దేశం మాత్రం ..మహిళా శ్రమకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం. సమాన వేతనాల కోసం జరిగిన ఒక మహిళా ఉద్యమం.. కార్మిక శక్తిగా తాము చేసే పని తక్కువేం కాదని నిరూపించుకున్న రోజు. అందుకే ఇది శ్రామిక మహిళా దినోత్సవం. కానీ, కాలక్రమంలో సామ్రాజ్యవాదం ..శ్రామిక.. అనే పదాన్ని చెరిపేయడంతో సాదాసీదా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మిగిలిపోయింది
భారతదేశంలో..
మహిళల్లో, మనోబలం పెంచేందుకు విమెన్స్ డేని ఒక అవకాశంగా చెప్తుంటారు మేధావులు. మిగతా దేశాల్లో మాదిరిగానే మన దేశంలోనూ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతాయి. పబ్లిక్-ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు, సెమినార్లు నిర్వహిస్తారు. డాక్యుమెంటరీలు, టీవీ షోలను ప్రదర్శిస్తారు. మీడియా ఛానెళ్లు, పత్రికలు ప్రత్యేక కథనాల ద్వారా ఈ రోజు ప్రాధాన్యతను వివరించే ప్రయత్నం చేస్తాయి.
ALSO READ : Women's Day Special: ‘ఈ పని చేసేటంత తెలివి నీకు లేదు’.. అనే రోజు నుంచి.. ఆమె నిలిచి గెలిచింది
మహిళా సాధికారత కోసం పాటుపడుతున్న ఎన్జీవోలు జెండర్ సెన్సిటివ్ నాటక ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పి స్తుంటాయి. మహిళలు అప్పటిదాకా సాధించిన ప్రగతి.. ఇంకా సాధించాల్సిన పురోగతి గురించి విస్తృతంగా చర్చించుకుంటారు.