కార్తీకమాసం.. నవంబర్​ 26 ఏకాదశి.. పరమేశ్వరుడిని.. విష్ణుమూర్తిని ఇలా పూజించండి..

కార్తీకమాసం.. నవంబర్​ 26 ఏకాదశి.. పరమేశ్వరుడిని.. విష్ణుమూర్తిని ఇలా పూజించండి..

కార్తీకమాసం కొనసాగుతుంది... ప్రతి నెల ఏకాదశి తిథి అంటే  ఆరోజుకు హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైనదని పండితులు చెబుతున్నారు.  ఇక కార్తీక మాసం నెల రోజులకు హిందూ పురాణాల ప్రకారం  చాలా విశిష్టత ఉంది.  ఇంకా .. సోమవారాలు.. ఏకాదశి తిథి రోజుల్లో చేసే పూజలు.. దానాలు కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.   కార్తీక మాసం కృష్ణపక్షం జరుగుతుంది.  ఈసమయంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశిగా జరుపుకుంటారు.  ఈ ఏడాది ఉత్పన్న ఏకాదశి నవంబర్​ 26 న వచ్చింది.  ఆ రోజున విష్ణుమూర్తి.. లక్ష్మీదేవిని పూజించి.. శివాలయంలో దీపారాదన చేస్తే .. జీవితం సంతోషకరంగా సాగుతుందని పండితులు చెబుతున్నారు.  అయితే ఈ రోజున ( నవంబర్​ 26) కొన్ని ప్రత్యేకమైన పూజలు.. పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి.. డబ్బుకోసం ఎప్పుడూ ఇబ్బంది పడరని స్కంద పురాణంలో రుషిపుంగవులు తెలిపారు.  

సహజంగా కార్తీకమాసం అంటే పరమేశ్వరుడిని పూజించి.. అర్చిస్తారు.  ఇక ఏకాదశి తిథి రోజు( నవంబర్​ 26) ఉపవాస దీక్షను పాటించి.. శ్రీమహావిష్ణువును పూజించాలి. ఇలా పూజ చేస్తే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు సమస్యల నుంచి విముక్తి పొందుతారని పురాణాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. విష్ణుమూర్తిని పూజించేటప్పుడు స్వామి వారి చిత్ర పటాన్ని ఒక పీటపై కొత్త వస్త్రం.. బియ్యం పోసి దానిపై ఉంచాలి.  ఆతరువాత దీపం వెలిగించి..షోడశొపచార విధంగా పూజలు చేయాలి.  ఆ తరువాత తులసి చెట్టు వద్ద పూలు, పసుపు, కుంకుమతో పూజించాలి.  తులసి మొక్కకు.. విష్ణుమూర్తికి.. లక్ష్మీ అమ్మవారికి ధూప, దీప నైవేద్యాలు సమర్పించాలి.  ఓంనమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపం చేయాలి (108 పర్యాయములకు తక్కువ కాకుండా).   ఇక పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయాలి.  

చాలామంది ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటిస్తారు.  ఇలా ఉపవాసం చేసేవారు పాలు.. పండ్లు తినాలి.  ఈ రోజున ( నవంబర్​ 26) దానం చేయడం వలన కోటిరెట్ల పుణ్యం వస్తుంది.      ఆహారం.. బట్టలు.. డబ్బును ఇలా ఏ వస్తువైనా దానం చేయవచ్చు... ఏకాదశి ఉపవాసం దీక్ష పాటించేవారు మనస్సును ప్రశాంతంగా.. పవిత్రంగా  ఉంచుకోవాలి.  శాలిగ్రామాన్ని రుషులు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు.  గంగాజలంతో శాలిగ్రామాన్ని కడిగి.. గుడ్డతో తుడిచి.. పసుపు.. కుంకుమ.. పూలతో అలంకరించి. లక్ష్మీనారాయణుడికి  పూజలు చేయలి.    ఇక ఉద్యోగస్తులు.. వ్యాపారస్తులు పైన తెలిపిన విధంగా పూజలతో పాటుగా నవంబర్​ 26న విష్ణుమూర్తికి కుంకుమపువ్వుతో అభిషేకం చేయాలి. ఇక పెళ్లికానివారు..  వివాహ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే విష్ణువును పూజించాలి.ఉత్పన్న ఏకాదశి రోజున కుంకుమ, పసుపు లేదా గంధంతో తిలకం దిద్ది...  శ్రీ హరికి పసుపు పుష్పాలను సమర్పించండి. ఇలా చేయడం వల్ల త్వరలో వివాహం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.  అప్పులతో బాధపడే వారు రావి చెట్టుకు నీరు సమర్పించి.. రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే రుణ బాధలు తీరతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.