జపానికి 108 సంఖ్యే ఎందుకు? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసా...

హిందూ ధర్మ శాస్త్రంలో 108 అనే సంఖ్యకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉపయోగించే రుద్రాక్షలో ఉండే పూసలు 108... మంత్రోచ్ఛారణ 108 సార్లు చేస్తారు. ప్రతి దేవుడికి అష్టోత్తర శతనామావళి తప్పకుండా చదువుతారు. ఇలా ఆధ్యాత్మిక ప్రపంచంలో 108 అనే సంఖ్య ఎక్కువగా వినిపిస్తుంది. రుద్రాక్ష మాలలో 108 పూసలు ఉంటాయి. ఇలా 108 అనే సంఖ్య అధ్యాత్మికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రాలు 108 సార్లు ఎందుకు పఠిస్తారు? 108 ప్రదక్షిణలు ఎందుకు  చేయమంటారు.. దీని వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలుసుకుందాం. . .  . .

గ్రంథాలలోని, శ్లోకాలు, పద్యాలు అన్ని కూడా 108 ఉండేలాగే రాస్తారు. అలాగే శివలింగాలు 108. క్షీరసాగరం మథనం చేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ సంఖ్య కూడా 108. అందులో దేవతలు 54 మంది ....అసురులు 54 మంది ఉన్నారు. అలా ప్రతి చోటా 108 అనే సంఖ్య ఎక్కువగా వినిపిస్తుంది. 

సంపూర్ణతకు చిహ్నం

హిందూ మతంలో 108 సంపూర్ణతకు చిహ్నంగా భావిస్తారు. పిండ రూపం దాల్చినప్పటి నుంచి మరణం వరకు ఒక వ్యక్తి జీవితం ఇందులోనే ఉంటుంది. ఒకటి ప్రారంభం సంఖ్య అయితే 0 అనేది శూన్యం. ఇక 8 దైవిక సంఖ్య అనంతం ...అంటే అంతం లేనిది అని అర్థం.

హైందవం ప్రకారంముఖ్య శివలింగాలు 108 అందుకే శైవ మతాలు కూడా 108.గౌడియ వైష్ణవంలో బృందావనలో 108 గోపికలను పూజిస్తారు. 108 వైష్ణవ దివ్య క్షేత్రాలుకంబోడియాలో ఆంగ్కోర్ వాట్ గుడిలో 108 మంది (అసురులు, దేవతలు) కలిసి సాగరమధనం చేసినట్టు చిత్రింపబడివుంది.హైందవ భావాలనుండి ప్రేరణ పొందిన బౌద్ధం ప్రకారం పంచేంద్రియాలతో స్పృహ ను కలిపి ఆరు భావాలను వాటివల్ల కలిగే అంతర్భావాలైన సుఖము, దుఃఖము, స్తిరత్వబుద్ధిని గుణించి అవి బాహ్యంగానైనా ఆంతరంగానైనా భూత, భవిష్యద్, వర్తమానాలలో కలిగిన భావనలను గుణిస్తే 6x3x2x3 = 108

దైవానికి దగ్గరగా

మంత్రాలు, ప్రార్థనలు, శ్లోకాలు పఠించేటప్పుడు హిందూ మతంలో 108 సార్లు చదువుతారు. ఈ పవిత్రమైన శబ్దాలను, పదబంధాలను బిగ్గరగా పట్టించడం వల్ల ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుందని చెప్తారు. మొత్తం ధ్యాన చక్రం 108 మంత్రాలని జపించిన తర్వాతే పూర్తవుతుంది. 108 సార్లు జపించడం వల్ల దైవంతో దగ్గరగా ఉంటారు.


జ్యోతిష్య శాస్త్రంలో..

వేద జ్యోతిష్య శాస్త్రంలో కూడా 108 అనే సంఖ్య ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. మనకు ఉన్న గ్రహాలు తొమ్మిది, రాశి చక్రాలు పన్నెండు. ఈ రెండింటినీ గుణిస్తే వచ్చేది (12*9)108. ఈ సంఖ్య సంబంధం విశ్వం మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది కూడా తెలుపుతుంది. నక్షత్రాలు మానవ ఉనికిపై చాలా ప్రభావం చూపిస్తాయి. మొత్తం నక్షత్రాలు 27 కాగా నాలుగు పాదాలు ఉంటాయి. ఇవి రెండిటినీ కలిపితే (27*4)108 అవుతుంది.

ప్రాచీన కాలం నుంచి 108 అనే సంఖ్య ఉపయోగిస్తూ వచ్చారు. వైష్ణవ పురాణం ప్రకారం దేశంలోనే ప్రముఖ విష్ణు దేవాలయాలు 108. క్షీరసాగరాన్ని మధించినప్పుడు 108 మంది ఆదిశేషునికి ఇరువైపులా ఉన్నారు.

భూమి, చంద్రుడు, సూర్యుడు మధ్య వ్యాసం

భూమి, సూర్యుడు, చంద్రుడు మధ్య సగటు దూరానికి కూడా 108 సంఖ్యకు ముడిపడి ఉంటుంది. ఖగోళ పరంగాసూర్యునికి, భూమికి ఉన్న దూరం 149.6million kms. ఈ దూరాన్ని సూర్యుని చుట్టు కొలత 1391000kms తో భాగిస్తే వచ్చే సంఖ్యా రమారమి 108...అలాగే చంద్రునికి భూమికి ఉన్న దూరం 38 లక్షల కిలోమీటర్లను చంద్రుని చుట్టుకొలత అయిన 3474 kms తో భాగిస్తే వచ్చే సంఖ్య 108

సంస్కృత భాషలో 54 అక్షరాలు ఉంటాయి. వాటికి శివ, శక్తి తత్త్వాలైన స్త్రీ, పురుష రూపాలుంటాయి. 54 x 2 =108


12000 దివ్య సంవత్సరాలు = 43,20,000 మానవ సంవత్సరాలు = బ్రహ్మకు ఒక పగలు = 4000 x 108108 లో 1 జీవుడిని తెలియచేస్తుంది. 8 జీవుని తత్త్వాలను తెలియ చేస్తుంది. 0 పరిపూర్ణ భగవత్తత్త్వము. ఈ శరీరాన్ని జీవుడిని కలిపి నియమించేది పరిపూర్ణ భగవత్తత్త్వము 108. ఈ సంఖ్యను కూడితే 1+0+8 = 9 చాలా ముఖ్యమైన సంఖ్య. 9 తో ఏది కలిపినా వచ్చిన సంఖ్యలో numberలను కలిపితే చివరకు అదే సంఖ్య వస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం కూడా మన శరీరంలో 108 మర్మ స్థానాలు ఉంటాయి. యోగా సంప్రదాయం ప్రకారం మానవ శరీరం ఏడు ప్రధాన చక్రాలు లేదా శక్తి కేంద్రాలతో కూడి ఉంటుంది. 108 డిగ్రీల జ్వరం వచ్చినప్పుడు శరీరంలో ఉన్న అన్ని అవయవాలు చచ్చుబడిపోతాయి.108 సార్లు జపం చేయడం వలన మనస్సును నిర్మలం చేస్తుంది.శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును నిర్వహించడం ఈ చక్రాలపై ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక సమతుల్యతను అవగాహనను సాధించడానికి ఈ శక్తులను సమలేఖనం చేయడం చాలా అవసరం.  అందుకు హిందూ ధర్మ శాస్త్రంలో 108 కి అంత ప్రాధాన్యత ఉంది. . .