మార్చి 10 అమలకి ఏకాదశి : ఉసిరిచెట్టును పూజించండి..క ష్టాలు తొలగుతాయి

మార్చి 10 అమలకి ఏకాదశి : ఉసిరిచెట్టును పూజించండి..క ష్టాలు తొలగుతాయి

హిందూ ధర్మంలో అమలకి ఏకాదశి రోజును ( 2025 మార్చి)  శ్రీహరి విష్ణువు పూజా ఆరాధనకు అంకితం చేయబడింది.  ఆ రోజు ఉసిరి చెట్టు పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీని వల్ల జీవితంలో సుఖ సమృద్ధులు వస్తాయని నమ్ముతారు. అమలకి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం. . .

అమలకి  ఏకాదశి రోజున (2025  మార్చి 10) విష్టుసంబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ రోజున విష్ణుమూర్తి.. శ్రీకృష్ణుడు కూడా ఉసిరి చెట్టును పూజించారని పురాణాల ద్వారా తెలుస్తుంది. అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజించడం వల్ల  కష్టాలు తీరి...  కోరికలు  నెరవేరుతాయని, సంసార సుఖంతో పాటు  మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ తిథిని ఆమలకి ఏకాదశి అని కూడా అంటారు.

సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి రోజున జగత్తును కాపాడే శ్రీహరి విష్ణువు పూజలు జరుగుతాయి. హిందూ పంచాంగం ప్రకారం, ఫాల్గుణ మాసం శుక్ల పక్షం ఏకాదశి తిథి రోజున ఆమలకి ఏకాదశి వ్రతం ఉంటుంది.

ఈ ఏడాది ( 2025)  మార్చి 10,న అమలకి ఏకాదశి వచ్చింది. ఈ రోజు విష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి. అమలకి ఏకాదశి రోజు సుఖ సమృద్ధుల కోసం కొన్ని ప్రత్యేక పరిహారాలు కూడా చేస్తారు. 

ALSO READ | Health Alert : ఫ్యాటీ లివర్ అంటే ఏంటీ.. చిన్న పిల్లల్లో ఎక్కువ ఎందుకు వస్తుంది.. లక్షణాలు ఏంటీ.. చికిత్స ఎలా..?

ధృక్ పంచాంగం ప్రకారం, ఫాల్గుణ మాసం శుక్ల పక్షం ఏకాదశి తిథి మార్చి 9, 2025 ఉదయం 07:45 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు మార్చి 10, 2025 ఉదయం 07:44 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఉదయతిథి ప్రకారం, మార్చి 10, 2025న అమలకి ఏకాదశి వ్రతం ఉంటుంది.

అమలకి ఏకాదశి  లక్ష్మీ నారాయణులకు అంకితం చేయడమైనది.   ఆరోజున ( మార్చి 10)  ఉసిరి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేయాలి. దీనివల్ల జీవితంలో సానుకూల శక్తిని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.  ఉసిరి చెట్టు సాక్ళాత్తు లక్ష్మీదేవి స్వరూపం.  ఆ రోజు ( మార్చి 10) ఉసిరి చెట్టు మొదట్లో  నీరు పోసి పపుపు.. కుంకుమ.. గంధం సమర్పించాలి. తరువాత ధూప ..దీప.. నైవేద్యాలు సమర్పించి హారతి ఇవ్వాలి,    ఇలా చేయడం వలన ధనం.. సంపద కలుగుతాయి. అమలకి  ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కింద ఆవ నూనె దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంట్లో సుఖ సమృద్ధులు ఉంటాయి.

  • అమలకి ఏకాదశి రోజు లక్మీదేవిని..  విష్ణువును పూజించాలి. ఉసిరి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల దాంపత్య జీవితంలో సుఖశాంతులు ఉంటాయి ..  సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది.
  • అమలకి ఏకాదశి రోజు ఉసిరికాయ దానం చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.  ఆ రోజు ఏదైనా ఆలయంలోకాని..  అవసరమైన వారికి ఉసిరికాయను దానం చేస్తే..  జాతక రీత్యా ఉన్న గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది
  • ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందడానికి ఉసిరి చెట్టు కింద కూర్చుని ..ఓం శ్రీ విష్ణు ప్రియాయ నమః.. మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ధన ధాన్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. .