ఆధ్యాత్మికం: చిన్నప్పుడే... గీత బోధిస్తే ఆత్మహత్యలుండవు..

ఆధ్యాత్మికం: చిన్నప్పుడే... గీత బోధిస్తే ఆత్మహత్యలుండవు..

ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయన్ని  జనాలు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. చిన్న సమస్యను కూడా తట్టుకోలేక జీవితాన్ని బలవంతంగా ముగిస్తున్నారు.  అయితే చిన్నప్పటి రోజుల్లో భగవద్గీత గురించి విశ్లేషిస్తే ఇలాంటి ఘటనలు జరగవని పండితులు చెబుతున్నారు.   దీంతో వారు డిప్రెషన్ కు గురయ్యే వారికి వారే ప్రాణాన్ని తీసుకుంటున్నారు.  విద్యార్థుల దగ్గర నుంచి రిచ్ పీపుల్ వరకు ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు. సమస్యలను ఎదుర్కోలేమని.. ఇక అదే వారి జీవితం అని .. తనువు చాలిస్తున్నారు.  

విద్యార్థులు.. రైతులు.. ఉద్యోగస్తులు ఒకరేమిటి అందరూ ఇదే పద్దతిని ఫాలో అవుతున్నారు.  పూర్వకాలాన్ని ఒకసారి పరిశీలిస్తే  ఆత్మహత్య ఘటనలు      చాలా తక్కువుగా ఉండేవి.  కాని ఆదునిక కాలంలో  WHO నివేదికల ప్రకారం  .. ప్రపంచ వ్యాప్తంగా 90  దేశాల్లో బలవన్మరణానికి పాల్పడిన వారి సంఖ్య చాలా ఎక్కువుగా ఉంది.  అయితే పూర్వకాలంలో ఎలాంటి సమస్య వచ్చినా.. చర్చించుకొని పరిష్కరించుకునేవారు.  ఆ సమస్య వారి చేతిలో లేకపోతే దేవుడిపై భారం వేసేవారు.. అంతేకాని ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారు. 

పూర్వకాలంలో దాదాపు హిందువుల ప్రతి ఇంట్లో రామాయణం.. భగవద్గీత ఆధ్యాత్మిక గ్రంధాలు ఉండేవి.  నిత్యం వాటిని పిల్లలకు చెప్పేవారు.  భగవద్గీతలో సమస్యల పరిష్కారం కోసం మానవులు పాటించాల్సినవాటిని గురించి తెలియచేశారు. 

శ్రీకృష్ణ పరమాత్మ ... అర్జునుని మిషగా పెట్టి లోకానికి భగవద్గీత ద్వారా జీవితసారాన్ని ఉపదేశించారు. దీనిని జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకోగలిగితే మానవజీవితం తామరాకుపై నీటి బొట్టు వలే సాగిపోతుంది. చిన్నప్పటి నుంచి భగవద్గీతను పిల్లలకు అర్దమయ్యే విధంగా చెబితే.. ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడరని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.  ప్రస్తుతం హైటెక్ యుగంలో జీవితాన్ని బిజి బిజీగా గడుపుతూ... ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడుతూ.. డిప్రెషన్ కులోనవుతున్నారు.  దీంతో జీవితానికి బలవంతంగా ముగింపు పలుకుతున్నారు.  అందుకే పిల్లలకు కనీసం వారానికి ఒకసారైనా భగవద్గీత శ్లోకాలను గురించి వివరించాల్సిన అవసరం ఎంతో ఉందని పండితులు అంటున్నారు. 

బాల్యప్రాయం నుంచి గనక భగవద్గీత శ్లోకాలను పిల్లలుచేత సాధనచేయించి ఆచరణలో పెట్టించ గలిగితే వారు జీవితంలో కర్త్రుత్వ భావనకలిగి నిరపేక్ష బుద్ధితో జీవించగలరు.  ఎప్పుడైతే పిల్లలు, యువత యొక్క ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుందో, అప్పుడు నిరాశావాదం తొలగి జీవితంలో ప్రతీక్షణం ఉత్సాహం గా ఉల్లాసంగా ఉండి జీవితంలో అన్నీ రంగాలలో పురోభివృద్ధి సాధిస్తారు. అప్పుడు ఈ ఆత్మహత్యలు నివారింపబడి ముఖ్యంగా యువత విశ్వశాంతి నెలకొల్పుతారు. స్వామీ వివేకానంద, మహాత్మా గాంధీ వంటి వారు నిత్యం భగవద్గీత పారాయణ చేసుకొని, వారికి నిత్య జీవితం లో ఎదురయ్యే ఎన్నో సవాళ్లకు సమాధానం పొందారు. ఈ గీతాసారం ఆధునిక యాజమాన్య నిర్వాహణకు కావలసిన ఎన్నో సూత్రాలను తెలియజేస్తుంది.

 
గీతాపారాయణం నిత్యకృత్యం అనుసరణీయం.. ఇటీవల ఒక  పుస్తక మిత్రుడు తాను ఇంతకాలం ఎవరికీ పెట్టకుండానే భుజించేవాడినని కానీ భగవద్గీత లోని ఒక వాక్యం తన జీవనాగమనాన్ని మార్చిందని తెలియచేసారు.. మనలో చాలా మంది భగవద్గీత వింటారు చదువుతారు, కానీ ఆచరణ పర్యంతంలోకి తెచ్చుకోరు. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారిని ఆచార్యులుగా పేర్కొంది. 


చాలా మందిలో భగవద్గీత జీవిత చరమాంకంలో ఉన్నవారికే అనే అపప్రధ ఉంది. కానీ వాస్తవానికి జీవించడం ప్రారంభించిన మొదలు అవగాహన చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీని నేపధ్యం చాలా విశిష్టంగా ఉంటుంది. అర్జున విషాదయోగం తో ప్రారంభించి కర్మ జ్ఞ్యాన వైరాగ్యాలను ఉపదేశిస్తాడు. పరంధాముడు. జీవితం అనిత్యం అశాశ్వతం .. అట్టిదానిగురించి ... దుఃఖించుట భీరువుల లక్షణమంటాడు. మనం చేసే పనిమీద కన్నా దాని ఫలితం మీద దృష్టి సారించడం ఎలాంటిదంటే కుక్కర్ లో బియ్యం పెట్టి మాటిమాటికి మూతతీసి చూడడం వంటిది. 

ALSO READ : ఆధ్యాత్మికం: శ్రీకృష్ణుడు.. అర్జునిడికి గీత ఎప్పుడు చెప్పాడో తెలుసా..

మానవునికి కర్మ చేయుటయందే అధికారముంటుంది గానీ దాని ఫలితం మీద ఉండదు. అట్లని కర్మ చేయడం మానరాదు.. ఈ శ్లోకాన్ని విశ్లేషించుకుంటే కర్తవ్యానికి .. బాధ్యతకు తేడా చెప్పబడింది. మనిషి కర్తవ్యాన్ని నిర్వహిస్తే తృప్తి కలుగుతుంది అదే బాధ్యత అనుకుంటే బరువుగా అనిపిస్తుంది.  ఎప్పుడెప్పుడైతే ధర్మం గతితప్పుతుందో అప్పుడప్పుడు నేను ధర్మసంస్థాపనకు అవతరిస్తాను  అని స్వామిఅంటాడు. పరమాత్మ ధర్మపక్షపాతి. .. ఆయన అవతార స్వీకరించింది మొదలు ధర్మ రక్షణ తన ప్రధమ కర్తవ్యం గా పెట్టుకొన్నాడు. అదే ధర్మ సంస్థాపన కొరకు కురుక్షేత్ర సంగ్రామం నిర్వహించి పాండవులకు రావలసిన రాజ్యాన్ని ధర్మబద్దంగా ఇప్పించాడు. 

భగవద్గీత మానవ జీవితానికి జీవనవేదం. మనిషి జీవితం ఎన్నో ఎత్తుపల్లాలు మయం. మాయామోహితం. రాగద్వేష మాయం. ఇట్టి త్రిగుణాత్మ భూయిష్ఠమైన జీవితం సాఫీగా సాగాలి అంటే ప్రతీవానికి జీవితంలో బలమైన ఊత అవసరం. ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే ఆ ఊతే భగవద్గీత.  ఆ గీతాచార్యుని త్రికరణ శుద్ధిగా నమ్మి ఎందరో ఈ భగవద్గీత పారాయణ చేసుకుని తరించిపోయారు. మానవుడు ఒకవిషయం గురించి కామించితే అది క్రోధంగా మారి దాని వలన బుద్ధి నశించి తుదకు అధోగతి పాలవుతారని విశ్వమానవాళికి సందేశమిచ్చారు పరంధాముడు. ఇది నిత్య సత్యం. అందుకే ఎవరికీ అధర్మ బద్ధమైన కామనలు ఉండకూడదు. కోరికలను ధర్మంతో ముడివేస్తే అట్టి ధర్మ సమ్మతమైన కోరికని ఆ పరమేశ్వరుడే తీరుస్తాడు.  అందుకే శ్రీకృష్ణుడు గీతాచార్యుడు అయినాడు.