మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ ఏడాది ( 2025) ఫిబ్రవరి 8 భీష్మ ఏకాదశి. దీనిని జయ ఏకాదశి, భీష్మ ఏకాదశి వంటి పేర్లతో పిలుస్తారు. శ్రీ కృష్ణుడు భీష్మ ఏకాదశి గురించి వివరించాడు. గంగామాత స్త్రీరూపంలో ధరించినపుడు అష్టవసువుల్లో ఆమెకు పుట్టిన ఏడవ కుమారుడే భీష్ముడు. ఈ రోజు నిష్టగా ఉపవాసం చేయడం వలన బాధలన్ని తొలగిపోతాయని.. దెయ్యాలు, భూతాలు, పిశాచాల వంటి శక్తుల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతుంటారు
పురాణాల ప్రకారం ... శ్రీమహా విష్ణువుకి ఇష్టమైన తిథి.. ఏకాదశి.. ఇక మాఘమాసం.. ఏకాదశి అంటే భీష్మ ఏకాదశి.. ఆరోజుకు( 2025 ఫిబ్రవరి 8) తేదీన ఉండే విశిష్టత అంతా ఇంతా కాదు. ఉత్తరాయణ కాలం వరకు వేచి యుండి .. ప్రాణాలు విడిచిన వ్యక్తి భీష్ముడు. మాఘ మాసంలో ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి అని అంటారు.
భారతీయ జనజీవనంతో పెనవేసుకుపోయిన భగవద్గీత మహాభారతంలోని భీష్మపర్వం.. మహాభారత గ్రంథానికే మకుటాయమానమైంది. భీష్మపర్వంలో భౌతిక, ఆధ్యాత్మిక రహస్యాలను శ్రీకృష్ణుడు వివరించాడని పండితులు చెబుతున్నారు. భీష్మ పితామహుడు మరణకాలంలో ... సాక్షాత్తు పరమాత్మా అయిన కృష్ణుణ్ణే తన ధర్మవర్తనంతోను , తపశ్శక్తితోనూ తన వద్దకు రప్పించుకొని, ఆయన సమక్షంలోనే సమస్త మానవాళి బాధల్ని పోగొట్టే శ్రీ విష్ణు సహస్రనామాన్ని గానంచేసి, మోక్షంపొందాడు భీష్ముడు.
నిజానికి భీష్ముడు శరీరాన్ని చాలించింది ఏకాదశినాడు కాదు. మాఘ మాసం శుద్ధపక్షం అష్టమినాడు రోహిణి నక్షత్రంలో సూర్యుడు మధ్యాహ్న వేళ నడినెత్తిమీద ప్రకాశిస్తూండగా పరమాత్మ ధ్యానంలో ఉండి శరీరాన్ని వదలి .. ప్రాణహాయువుని వదలాడు. భీష్మ పితామహునకు స్వచ్చంద మరణం ఉన్నందున అంపశయ్యపై ఉండికూడా, ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు వేచి ఉండి , ఏకాదశి రోజున శ్రీకృష్ణ పరమాత్మ దివ్య ఆశీస్సులతో అత్యంత గోప్యమైన ధర్మాన్ని ధర్మరాజునకు ఉపదేశిస్తారు . అదియే శ్రీ విష్ణు సహస్ర నామము.
వాస్తవానికి దక్షిణాయణంలోనే అనగా మాఘశుద్ద ఏకాదశికి ముందు 58 రోజులపాటు అంపశయ్యపై పడినా.. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆగి.. కౌరవులకు.. పాండవులకు మధ్య జరిగిన యుద్దంలో అధర్మం వైపు నిలిచినందుకు .. శిక్షను తనకుతానే విధించుకుని... పరమాత్మా దర్శనంతో.. తన తప్పులను మన్నించాడని గమనించిన భీష్ముడు సంతృప్తితో జీవించి వుండగానే మోక్షం పొందిన మహనీయుడు.
అంపశయ్యపై ధ్యానం చేసుకుంటూ ఉన్న స్థితిలో .. ఎవరో ఒక వ్యక్తి తన దగ్గరరకు వచ్చినారని గ్రహించిన ఆ మహాను భావుడు పరమాత్మ అయిన శ్రీకృష్ణుడిని.. పాండవులను.. మూసుకుపోయిన కను రెప్పలను భారంగా తెరచి చూశాడు. అప్పుడు చిట్ట చివరి దశలో ఉన్న కురు వృద్దుడైన భీష్మునికి ఎంతో ఆనందం కలిగి.. భక్తితో శ్రీకృష్ణునకు నమస్కరించాడు. ఆ సమయంలో పాండవులు.. భీష్మపితామహునకు పాదాభివందనం చేశారు.
ధర్మరాజు... భీష్ముడను పితామహ అని సంభోదిస్తూ... యుద్దంలో శ్రీకృష్ణుడి సాయంతో భౌతికంగా విజయం సాధించాను కాని.. మానసికంగా గెలవలేకపోయాననని విన్నవించాడు.. మానసిక శాంతి కలగాలంటే ఏం చేయాలి.. ఏ దేవుడిని శరణు కోరాలి. అని అడగ్గా.. అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజును చూసి .... తన చూపులను వాసుదేవుడైన శ్రీకృష్ణునిపై నిలిపి.... ధర్మరాజా ... లీలా మానుష విగ్రహుడైన ఈ శ్రీకృష్ణుడే అంటూ చేతులు జోడించి... విష్ణసహస్రనామాన్ని వేయి విధాలుగా కీర్తిస్తూ, విశ్వకళ్యాణ కాంక్షతో మానవాళికి అందించాడు. అదే ఏకాగ్రతతో శ్రీకృష్ణుని చూస్తూ .. ఊర్ధ్వలోక ప్రయాణానికి అనుమతి ఇమ్మని కోరాడు. అలా భీష్ముని ప్రస్థానం ముగిసింది.