Spiritual: గోత్రం విశిష్టత ఏమిటి.. ఎవరు నిర్ణయిస్తారు..

Spiritual:  గోత్రం విశిష్టత ఏమిటి.. ఎవరు నిర్ణయిస్తారు..

హిందువులు ఏదో ఒక సందర్భంలో ఆలయాలకు వెళ్తారు.. అక్కడ భగవంతుడిని ప్రార్థిస్తూ.. ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. అప్పుడు ఆలయ పూజారి గోత్రం.. పేరు అడుగుతారు. పూజ చేసేటప్పుడు పూజారి గోత్రం.. పేరు చదువుతూ పూజలు చేస్తారు.  అంతేకాదు పెండ్లి సంబంధాలు కుదుర్చుకొనేటప్పుడు కూడా గోత్రాలు చూస్తారు.  అసలు గోత్రం అంటే ఏమిటి... అది ఎలా వచ్చింది.. దానిని ఎవరు నిర్ణయిస్తారు అనే అంశాలను తెలుసుకుందాం. . . . 

హిందువులు  పూజలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.  పూజలు చేసే సమయంలో గోత్రం పేరు చదువుతారు. ఇలా చదవడం త్రేతాయుగం నుంచి వస్తుంది.  పెళ్లిళ్ల సమయంలో కూడా మూడు తరాల వారి పేర్లను.. గోత్రాలను సంభోదిస్తారు .  గోత్రం అనేది రుషుల పేర్లు.  ఆ రుషుల సంతతికి  గోత్రంగా ఆయన పేరు వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.  అంటే ప్రతి గోత్రానికి ఒక్కో రుషి పేరు ఉంటుంది. 

పురాణాల్లో గోత్రాలకు సంబంధించి అనేక విషయాలను ప్రస్తావించారని పండితులు చెబుతున్నారు.  ఆధ్యాత్మిక వేత్తలు  తెలిపిన వివరాల ప్రకారం హిందువులకు సంబంధించిన గోత్రాలు సప్తరుషులతో అంటే ఏడుగురు రుషుల ద్వారా వంశాలు వృద్ది చెందాయని పండితులు చెబుతున్నారు. ఈ రుషులలో ప్రతి ఒక్కరూ తమ వంశాలను స్థాపించారని చెబుతారు. ఇదే గోత్ర వ్యవస్థకు ఆధారమైంది. పౌరాణిక సంబంధం ప్రకారం గోత్రాల పవిత్రత పురాతన మూలాలున్నాయి.

వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అత్రి, జమదగ్ని, గౌతముడు, భరద్వాజ, కశ్యపుడు మొదలైన వారు వంశాలకు సృష్టికర్తలని చెబుతారు.  అయితే వీరి ద్వారా కొంతమంది కారణ జన్ములు కూడా ఉద్భవించారు. అప్పుడు వారికి చెందిన గోత్రంలో రుషులుగా వారిని చేర్చారు. ప్రవర చదివేటప్పుడు... ఉదాహరణకు.. శ్రీవత్సస గోత్రం అయితే ...జమదగ్ని.. చవన.. బార్గవ..అప్నువ.. ఔరవ.. అని రుషుల పేర్లు చదువుతూ.. పంచార్షేయ అని చదివి.. తరువాత పేరు చదివి పూజ చేస్తారు.  

  హిందూ సంప్రదాయం ప్రకారం , జైన మతం, బౌద్ధ మతం వంటి కొన్ని భారతీయ మతాలు ఈ గోత్రాలను గుర్తిస్తాయి. హిందూ గ్రంథాల ప్రకారం ప్రాథమికంగా  మొత్తం 49 కి పైగా గోత్రాలున్నాయి.  వీటినుంచి మరికొన్ని శాఖలుగా చీలి అనంతంగా ఏర్పడ్డాయి.  గోత్రాలను రుషుల ఆధారంగా నిర్దేశిస్తారు. సాధారణంగా పూజలు చేసేటప్పుడు.. గోత్రం చదివి.. మగవారి పేరు చదువుతారు.. తరువాత మళ్లీ మగవారు పేరు చదివి భార్య పేరు చదవకుండా ధర్మపత్నీ సమేతస్య అని చదువుతారు.  అయితే కంప్యూటర్​ యుగంలో భార్య పేరు కూడా చదువుతున్నారు. మహిళలకు వివాహం అయిన తరువాత గోత్రం మారిపోతుంది. అంటే భర్త గోత్రాన్ని స్వీకరిస్తారు.  వివాహానికి ముందు ఆడపిల్లల  పేరుతో పూజలు చేయాల్సివచ్చినప్పుడు గోత్రకారిణి అని సంబోధిస్తారు. ఇది తరతరాలుగా ఆచరిస్తున్న సంప్రదాయం. నేటికీ బిడ్డ పుట్టినప్పుడు వారి గోత్రాన్ని వారి పేరుతో పాటు ప్రకటిస్తారు. ఇది పూర్వీకులు వంశంతో ముడిపడి ఉంటుంది.