కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేయాలి.. తల స్నానం ఎలా చేయాలి.. రాత్రి సమయంలో ఏం చేయాలి..

కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేయాలి.. తల స్నానం ఎలా చేయాలి.. రాత్రి సమయంలో ఏం చేయాలి..

కార్తీకమాసం కొనసాగుతుంది. పంచాంగం ప్రకారం  కార్తీక పౌర్ణమి ( నవంబర్​ 15 శుక్రవారం ) వచ్చింది.  ఆరోజు చాలా విశిష్టమైన రోజు.   సహజంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని అర్చిస్తారు.  ఇక కార్తీకమాసం..పౌర్ణమి .. శుక్రవారం అంటే ఆరోజు చేసిన వ్రతాలు.. పూజలు.. దేవాలయ దర్శనాలు..  దీపారాధన.. దానాల వలన కోటిరెట్ల ఫలితం వస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.  

కార్తీక పౌర్ణమి రోజున కొన్ని ఆచారాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.  దేవాలయంలోకాని.. రావి చెట్టు వద్దగాని.. తులసి చెట్టు వద్ద గాని .. నదీతీరంలో గాని 365 వత్తులతో దీపారాధన చేయాలి.  కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజు.   ఆ రోజున ( నవంబర్​ 15) పగలంతా ఉపవాసం ఉండి.. సూర్యాస్తమయంలో దీపారాధన చేసి.. పరమేశ్వరుడిని.. విష్ణుమూర్తిని పూజించాలి. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు,   ఈ రోజున చేసే పూజలు..  .. దీపదానం .. లాఒటివి గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి.  


కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామున .. సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. తల స్నానం చేయాలి. అయితే ఈ రోజు ( నవంబర్​15)న తల స్నానం చేసేటప్పుడు... కుంకుడు కాయ... షాంపు వంటివి వాడకూడదు.  పురాణాల ప్రకారం.. పౌర్ణమి రోజు ఆరాధనకు.. భక్తికి.. పూజలకు.. దానాలకు.. వ్రతాలకు.. దైవ సంబంధిత విషయాలకు ఆధ్యాత్మిక విషయంలో ఎంతో విశిష్టమైన రోజు.  కనుక ఈ రోజున ( నవంబర్​ 15) జుట్టును కత్తిరించుకోవడం.. జుట్టును శుభ్రపరచుకోవడం నిషేధించారు.  తలస్నానం చేసేటప్పుడు కుంకుడు కాయ రసంగాని.. షాంపు గాని తలపై రుద్దితో జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది.  తరువాత ఉతికిన వస్త్రాలు ధరించి ( కొత్తవి అయితే మరీ మంచిది) .. దీపారాధన చేయాలి.   తరువాత దగ్గరలోని శివాలయానికి వెళ్లి.. రుద్రాభిషేకం చేయాలి. ఆ రోజంతా భగవంతుని ధ్యానంలో గడపాలి.  ఉపవాస దీక్ష పాటించాలి.  ( పాలు.. పండ్లు తీసుకోవాలి)

ఇక సాయంవేళలలో అంటే సూర్యాస్తమయంలో.. స్నానం చేసి.. ఆవు నెయ్యితో గాని... నువ్వుల నూనెతో గాని.. 365 వత్తులతో దీపారాధన చేయాలి.  ఈ దీపారాధనను దేవాలయ ప్రాంగణంలో గాని.. నదీ తీరంలో గాని.. తులసి చెట్టు వద్ద గాని.... బావుల వద్ద గాని  చేయాలి. నదీ తీరంలో చేసినట్లయితే అరటి దొప్పలపై దీపారాధన చేసి నదుల్లో వదలాలి.  ఇక ఉసిరికాయపై ఆవునెయ్యిలో గాని.. నూనెలో గాని ముంచిన వత్తిని ఉంచి దీపారాధన చేయాలి.  ఈ రోజున నిరుపేదలకు.. బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి.  వారికి భోజనం పెట్టాలి.  పేదలతో... వృద్దులతో..  నిస్సహాయులను ఇబ్బంది పెట్టకూడదు.. వారితో అనుచితంగా ప్రవర్తిస్తే.. మీ ఖాతాలో ఇప్పటి వరకు ఉన్న పుణ్యం పోయి పాపం మూటకట్టుకుంటారని పండితులు చెబుతున్నారు. 

కార్తీకపౌర్ణమి రోజు రాత్రి సమయంలో అంటే 6 గంటల నుంచి 8 గంటల లోపు లక్ష్మీ దేవి ఆలయానికి కాని.. శివాలయానికి వెళ్లి.. దీపారాధన చేసి .. లక్ష్మీదేవి నా పూజించి.. ఎండుకొబ్బరి.. అటుకులు,, బెల్లం  నివేదన సమర్పించాలి. అనంతరం పరమేశ్వరుని అభిషేకం చేసి.. విష్ణు సహస్రనామం.. లక్ష్మీ చాలీసా పారాయణం చేయాలి.  ఇలా పారాయణకు అవకాశం లేకపోతే ఓం నమ:శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు అనుష్ఠానం చేయాలి.  రాత్రి  భగవంతుని ధ్యానిస్తూ జాగారం చేయాలి.  

నదుల్లో ఎందుకు స్నానం చేయాలంటే...

హిందూ పురాణాలు తెలిపిన వివరాల ప్రకారం... కార్తీక మాసంలో విష్ణు భగవానుడు చేప రూపంలో నీటిలో నివసిస్తాడు.  అందుకే  ఈ సమయంలో నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది.  ఈ విధంగా చేయడం వలన పాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు.  నదీ స్నానానికి వెళ్లే అవకాశం లేకపోతే... గంగా జలాన్ని నీటిలో కలిపి స్నానం చేయడం వలన మోక్షం పొందుతారు.