
కలియుగంలో మానవులు.. తెలిసో.. తెలియకో అనేక పాపాలు చేస్తారు. వీటినుంచి విముక్తి కలగడానికి దేవాలయాలను సందర్శించడం.. దాప ధర్మాలు చేయడం.. పుణ్య నదుల్లో స్నానం చేయడం లాంటివి చేస్తుంటారు. కాని తెలుగు సంవత్సరంలో చివరి నెల .. చివరి ఏకాదశి రోజున అంటే ఫాల్గుణమాసం కృష్ణపక్షం ఏకాదశి రోజున ( 2025 మార్చి25) కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా పుట్టిన దగ్గరి నుంచి చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ..
పురాణాల ప్రకారం.. పాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పాపవిమోచన ఏకాదశి అంటారు. ఈ ఏడాది ( 2025) మార్చి 25 వ తేదీన పాపవిమోచన ఏకాదశిని జరుపుకుంటారు.
2025 పాపమోచని ఏకాదశి ఎప్పుడు?
పాల్గుణ మాసం కృష్ణ పక్ష ఏకాదశి తిథి మార్చి 25న ఉదయం 5:05 గంటలకు ప్రారంభం
క్రోధినామ సంవత్సరం పాపవిమోచన ఏకాదశి తిథి ముగింపు : మార్చి 26న తెల్లవారుజామున 3:45 గంటలకు
అటువంటి పరిస్థితిలో ఉదయతిథి ప్రకారం, పాపమోచని ఏకాదశి ఉపవాసం మార్చి 25, 2025న చేయాల్సి ఉంటుంది.
పాపమోచని ఏకాదశి అంటే పాపాలను నాశనం చేస్తుందని.. తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి , అపరాధ కర్మల నుంచి విముక్తిని కలిగిస్తుందని నమ్ముతారు. ఈ ఏకాదశిని పూర్తి భక్తితో ఆచరించడం ద్వారా, వ్యక్తికి భూత, ప్రేత ప్రేరేపిత ప్రభావం ఉండదు. వైష్ణవాలయలను సందర్శించడం ద్వారా వెయ్యి ఆవులను దానం చేసినంత ఫలితం ఉంటుంది. ఈ సంవత్సరం పాపమోచని ఏకాదశి ఉపవాసం మార్చి 25, 2025న పాటించబడుతుంది.
.దీని ప్రకారం.. పామోచని ఏకాదశి ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షంలో వస్తుంది.. ఉత్తర భారత క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని కృష్ణ పక్షంలో జరుపుకుంటారు.
పాపమోచని ఏకాదశి అంటే పాపాలను నాశనం చేస్తుందని.. తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి , అపరాధ కర్మల నుంచి విముక్తిని కలిగిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి.. విష్టు సంబంధ ఆలయాలను సందర్శించాలని పండితులు చెబుతున్నారు.
పురాణాల ప్రకారం శ్రీ మహా విష్ణువును.. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి.. పాపాల నుంచి విముక్తి పొందడానికి పాపమోచని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. పాపమోచని ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని.. జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. పాపమోచని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పూజ చేయడం ద్వారా కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.
పాపమోచని పేరులో ఉంది.. పాపల నుంచి విముక్తినిచ్చేది అని. పాపమోచని ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తి తెలిసి తెలియక చేసిన సకల పాపాలు నశిస్తాయి. పాపమోచని ఏకాదశి రోజున ఉపవాసం ఉండటంతో పాటు, లక్ష్మీనారాయణులను కూడా నిర్మల హృదయంతో పూజించాలి. దీనితో పాటు పాపమోచని ఏకాదశి ఉపవాస కథను కూడా చదవాలి లేదా వినాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలు శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్మకం.
పాపమోచని ఏకాదశి భక్తుడిని పాపాల నుండి విముక్తి చేసి అతనికి మోక్ష మార్గాన్ని తెరుస్తుంది. ఈ రోజు ఉపవాసం ఆచరించడం వలన జన్మజన్మల పాపాలు నశిస్తాయి. దీనితో పాటు పాపమోచని ఏకాదశి ఉపవాసం చేసి.. తీర్థయాత్రలను సందర్శించడం వలన వెయ్యి గోవులను దానం చేయడం వలన వచ్చే పుణ్యం కంటే ఎక్కువ పుణ్యం పొందుతారని పండితులు చెబుతున్నారు.
పాపమోచని ఏకాదశి రోజున ( మార్చి 25) అన్నదానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈరోజు పేదలకు మీ శక్తి సామర్థ్యం మేరకు ఆహారం, స్వీట్లు, పండ్లు, బట్టలు, పుస్తకాలు వంటి వాటిని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎప్పటికీ ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. శాస్త్రాల ప్రకారం, ఈరోజు శ్రీ మహా విష్ణువును స్మరించుకుని ఆలయంలో తులసి లేదా దీపదానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు.
పూజా విధానం
- పాపమోచని ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి బ్రహ్మ ముహుర్తంలో స్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించాలి.
- ఆ తర్వాత ఇంట్లో పూజా గదిని శుభ్రం చేసి శ్రీహరి, లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోలను ప్రతిష్టించాలి.
- శ్రీ హరికి అభిషేకం చేసి, లక్ష్మీదేవితో పసుపు పూల మాల సమర్పించాలి.
- విష్ణువు పూజలో తులసి ఆకులను తప్పకుండా పెట్టాలి.
- శ్రీ హరిని ప్రసన్నం చేసుకునేందుకు విష్ణు చాలీసా పారాయణం చేసి, చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి.
ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటిస్తే చాలా అనారోగ్య సమస్యలనుంచి ఉపశమనం కలుగుతుందని... అనేక రోగాల విముక్తి కలిగి పురాణాలు చెబుతున్నాయి.పాపవిమోచన ఏకాదశి వ్రతాన్ని పాటించడం వలన సకల పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.