హిందువులు పండుగలకు .. పర్వ దినాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మాఘమాసం కొనసాగుతుంది. లోకానికి వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడి పుట్టిన రోజు మాఘమాసం శుక్ల పక్షం సప్తమి తిథి రోజున సూర్యభగవానుడు జన్మించాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి 4 వ తేదీన వచ్చింది. రథసప్తమి రోజున పూజ ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ... నిర్దేశాన్ని మార్చుకునే రోజు రథసప్తమి . అలాంటి సమయంలో చెయ్యాల్సిన కొన్ని పనులు చెయ్యటం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందటమే కాదు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం, బ్రహ్మ ముహూర్తపు శుభ సమయంలో స్నానం చేయడం, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల పాపాలు విముక్తమవుతాయని, తీవ్రమైన అనారోగ్యాలు తొలగిపోతాయని నమ్ముతారు.
రథసప్తమి రోజున సూర్యభగవానుడిని స్మరించుకుంటారు. దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు. సూర్య భగవానుడు ప్రత్యక్షమై తన బంగారు రథాన్ని అధిరోహించాడని నమ్ముతారు. రథ సప్తమి కథలోకి వస్తే...సూర్య దేవుడు, కశ్యప మహర్షి, అతని భార్య అదితికి జన్మించాడు. సూర్యుడు అన్ని జీవులకు ప్రాణ ప్రదాత. సూర్యుడు ఒక సంవత్సరంలో ప్రతి 12 రాశుల గుండ పూర్తి ప్రయాణాన్ని పూర్తి చేస్తాడు.
ALSO READ | Vasanta Panchami 2025: చదువుల తల్లి పండుగ..సరస్వతి దేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి..
పూర్వకాలంలో చాలామంది ఉదయం సూర్య దేవుడిని పూజిస్తారు. స్నానం చేసిన తరువాత సూర్య నమస్కారాలు చేస్తారు. రథ సప్తమి రోజుఉదయాన్నే లేచి పూజలు నిర్వహిస్తే తప్పకుండా ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారని పండితులు అంటున్నారు.
రథ సప్తమి ( ఫిబ్రవరి 4) నాడు సూర్య స్నానాలు చేయాలి. అంటే సమీపంలోని నది లేదా సముద్రంలో స్నానం చేసి సూర్య భగవానుడిని పూజించాలి. భక్తితో సూర్యుడిని పూజించడం వల్ల జీవితంలోని సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. సూర్యుని భక్తితో ఒక నియమం ప్రకారం పూజించాలి. అప్పుడే చేసిన పూజకి ఫలితం ఉంటుంది.
రథసప్తమి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా నది లేదా సముద్ర స్నానం చేయాలి. లేదంటే ఇంట్లోనే స్నానం ఆచరించాలి. పసుపు రంగు దుస్తులు ధరించి సూర్య దేవుడిని పూజించాలి. ముందుగా రాగితో అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత సూర్య దేవుని ఆరాధించి.. సూర్య మంత్రం, సూర్య చాలీసా పఠించాలి. ఆ తర్వాత సూర్యదేవునికి హారతి ఇవ్వాలి. దీంతో పాటు నీరు, వివిధ రకాలు అన్ని కూడా సూర్యునికి సమర్పిస్తారు. ఇలా పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. సంతోషం, శ్రేయస్సు, మంచి ఆరోగ్యం లభిస్తాయని భక్తులు నమ్ముతారు. రథసప్తమి రోజున సూర్యదేవుడిని పూజించడం వల్ల సకల సౌఖ్యాలు కలుగుతాయి. అలాగే శారీరక, మానసిక బాధల నుంచి కూడా ఉపశమనం పొందుతారు.