హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజుల్లో ఒకటి శని త్రయోదశి.... అంటే శనివారం రోజున త్రయోదశి తిధి వస్తే.. ఆ రోజుని శని త్రయోదశి అని అంటారు. శనివారం శనీశ్వరుడికి, విష్ణువు, ఇష్టమైన రోజు అయితే.. త్రయోదశి తిధి శివుడికి ఇష్టమైన తిథి.. డిసెంబర్ 28 శని త్రయోదశి. ఆరోజున శని భగవానుడికి .. నువ్వుల నూనెతో అభిషేకం చేసి.. నువ్వులు.. బెల్లం కలిపిన పదార్ధాలు నైవేద్యం సమర్పించాలని పండితులు చెబుతున్నారు. నువ్వుల దానం కూడా ఇవ్వాలి. హిందువులు శని త్రయోదశిని శని ప్రదోషం అంటారు. శనివారం.. త్రయోదశి తిథి ఉన్న రోజును శనిత్రయోదశిగా పరిగణిస్తారు. ఆ రోజు ( డిసెంబర్ 28) శని భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజున శివాలయంలో శని భగవానుడిని పూజిస్తే కష్టాలు తీరుతాయని పండితులు చెబుతున్నారు. శని త్రయోదశి శివుడు, పార్వతి దేవి ... శని భగవంతుని ఆరాధనకు అంకితం చేయబడింది. ఆ రోజున శని భగవానుడిని ఆరాధిస్తే... శని ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం పొందుతారు. శనిదోష ప్రభావం తగ్గుతుందని పురాణాలు చెబుతున్నాయి.
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం
ఈ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపం చేయాలి.
శని త్రయోదశి తేదీ మరియు సమయం
- శని త్రయోదశి 2024 తేదీ: 28 డిసెంబర్ 2024
- త్రయోదశి తిథి ప్రారంభం: 2:26 AM, 28 డిసెంబర్ 2024
- త్రయోదశి తిథి ముగింపు: 3:32 AM, 29 డిసెంబర్ 2024
శని త్రయోదశి పూజా విధానం:
శని త్రయోదశి రోజున బ్రహ్మ ముహూర్త సమయానికి నిద్ర లేచి కాలకృత్యాల అనంతరం.. శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపారాధాన చేసి.. శని భగవానుడిరి ఆరాధించి పూజించాలి. శని భగవానుడితో పాటు శివ పార్వతులను కూడా అర్చన చేయాలి. ఉపవాస దీక్షను పాటించాలి.
శని త్రయోదశి రోజున శివాలయంలో నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి.. శని భగవానుడికి తైలాభిషేకం చేయాలి. తరువాత తమలపాకులో నువ్వులు.. బెల్లంతో తయారు చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత స్నానం చేసి.. మరల శివాలయంలో శివుడికి గాని.. ఆంజనేయ స్వామికి గాని 11 ప్రదక్షిణలు చేయాలి. శని వాహనం కాకి.. కావున కాకికి ఆహారాన్ని పెడితే చాలా మంచిదని పూజారులు చెబుతున్నారు. నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో పంచదారను చల్లండి.
ఆ తరువాత రావి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. శని భగవానుడి భార్య జ్యేష్టాదేవి.. రావి చెట్టు మొదట్లో నివసిస్తుంది. శని త్రయోదశి రోజున రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు.. శని దోషం తొలగిపోతుంది.
మనం ఎప్పుడు కూడా శని శని శని అని పిలిచి భయపడక్కర్లేదు. నిజానికి ఆయన నామం శనైశ్చరుడు. ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఉంటుంది.ఈశ్వరుడు అనేటటువంటి శబ్దం రావడం చేత ఈ శనైశ్చరుడు కూడా శివుడిలాగా, వేంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడు అని శాస్త్రాలు ఖచ్చితంగా చెబుతున్నాయి. కనుక ఎటువంటి భయాలకు పోకుండా ముక్కోటి దేవతలలో ఒకరైన శనైశ్చరుడిని త్రికరణ శుధ్ధిగా పూజిస్తే అంతా శుభమే.శని అని ఏలినాటి శని అని ఎవరన్నా చెబితే భయపడకండి .చక్కగా అతన్ని స్మరించండి చాలు... ఆయన అదుపులో వున్న అన్ని సమస్యలనుండి బయటపడేస్తాడు.