Ugadi 2025: ఉగాది పండుగ పచ్చడి ఎందుకు తినాలి.. ఆరోజు ప్రాముఖ్యత ఏమిటి..

Ugadi 2025:  ఉగాది పండుగ పచ్చడి ఎందుకు తినాలి..  ఆరోజు ప్రాముఖ్యత ఏమిటి..

మరో కొద్ది రోజుల్లో తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. తెలుగు పంచాంగం ప్రకారం చైత్రమాసం శుద్ద పాడ్యమి రోజున ఉగాది పండుగతో కొత్త సంవత్సరం ఆరంభం కానుంది. ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి 30న వచ్చింది.  ఉగాది పండుగ రోజు అందరూ కచ్చితంగా ఉగాది పచ్చడి తినాలని పండితులు చెబుతుంటారు. అసలు ఆ రోజు ఉగాది పచ్చడి  ఎందుకు తినాలి.. .. కొత్త సంవత్సరం పేరేమిటి.. .మొదలగు వివరాలను తెలుసుకుందాం. . . .

తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా.. భక్తి భావంతో జరుపుకునే పండుగల్లో ఉగాది ఒకటి..  ఈ ఉగాది (Ugadi) రోజుకు ( మార్చి 30)  ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. . ఉగాది అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది.. పండుగ రోజున చేసే పచ్చడే.. అన్ని పండుగల సమయంలో పిండి వంటలు ప్రత్యేకంగా నిలుస్తాయి. వాటన్నింటికంటే.. అత్యధికంగా ఉగాది పచ్చడికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.  తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు.. ఈ ఆరు రుచులతో తయారు చేసే పచ్చడి వెనుక సంప్రదాయంతోపాటు అంతకుమించి ఆరోగ్య ప్రయోజనం కూడా ఉంది.


ప్రస్తుతం క్రోధి నామ సంవత్సరం నడుస్తుండగా.. ఉగాది రోజు ( మార్చి 30)  నుంచి విశ్వావశు నామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక ..

 బెల్లం : ఉగాది పచ్చడిలో తీపిదనం కోసం కొత్త బెల్లాన్ని వాడతారు.  ఆరోగ్య పరంగా  బెల్లానికి జీర్ణక్రియను వృద్ది చేస లక్షణం ఉంటుంది.  మధురమైన రుచి కోస్ ఉపయోగించే బెల్లం.. కొత్త సంవత్సరంలో మనకు సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటూ కొత్త బెల్లాన్ని  ఉగాది పచ్చడిలో బెల్లాన్ని వాడుతారు. 

చింతపండు :   ఉగాది పచ్చడిలో  పులుపు రుచి కోసం కొత్త చింతపండును వాడతారు.  దీనికి కఫం.. వాతం  మొదలగు రుగ్మతలను నివారిస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. పులుపు రుచి విసుగును కూడా కలుగజేస్తుంది. కొత్త సంవత్సరం అంతా విసుగు చెందకుంగా ఓర్పుగా సహనంగా ఉండాలని కోరుకుంటా ఉగాది పచ్చడిలో పులుపు కోసం కొత్త చింతపండును వాడతారు. 

కారం :   ఉగాది పచ్చడిలో కారం రుచి కోసం పచ్చిమిరపకాయలను కాని.. చిల్లీ పౌడర్​ కాని వాడతారు.  శరీరంలో ఉండే కొన్ని క్రిములు ఎన్ని మందులు వాడినా.. తొలగిపోవు.  అలాంటివి మన శరీరానికి హాని కలుగ జేస్తాయి.  అలాంటి హానికరక క్రిములను నాశనం చేసి శరీరంలో ముఖ్యమైన పంచేద్రియాలు చురుకుగా పని చేయడానికి కారం ఉపయోగపడుతుంది.  అంతేకాక కారం కఠినపరిస్థితులకు సంకేతంగా ఉంటుంది. అందుకే కొత్త సంవత్సరంలో ఎదురయ్యే ఎలాంటి క్లిష్ట.. కఠినతరమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంటామని తెలిపేందుకు ఉగాది పచ్చడిలో కారం ఉపయోగిస్తారు. 

ఉప్పు :  ఉగాది పచ్చడిలో సైంధవ లవణం (ఉప్పు)ను వాడతారు.   ఉప్పు లేని కూర చప్పగా ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే.. అంటే ఉప్పు తినని మనిషి జీవితం నిస్సారంగా కొనసాగుతుంది.  ఉప్పు ఉత్సాహాన్ని.. శక్తిని కలుగజేస్తుంది.  అందుకే ఏడాదంతా.. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేందుకు ఉగాది పచ్చడిలో ఉప్పును వాడతారు. 

లేత వేపపువ్వు:  దీనిని ఉగాది పచ్చడిలో కచ్చితంగా వాడతారు. వేపపువ్వు చేదుగా ఉంటుంది.  ఉగాది పండుగ రోజు రుతువులు మారతాయి.  ఇలా మారడం వలన శరీరంలో కలిగే అనేక రోగాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.  అంతే కాకుండా చేదు బాధలకు.. దు:ఖాలకు.. కష్టాలలకు  సంకేతం.  మానవ జీవితంలో కష్ట.. సుఖాలు కచ్చితంగా ఉంటాయి కదా.. అందుకే కష్టం వచ్చినప్పుడు కుంగి పోకుండి.. ఎలాంటి బాధలు.. కష్టాలు.. దుఖాలనైనా తట్టుకొని నిలపడేందుకు ఉగాది పచ్చడిలో చేదు కోసం లేత వేపపువ్వును వాడతారు. 

లేత మామిడిపిందలు:  ఉగాది పచ్చడి వగరు రుచి కోసం లేత మామిడి కాయలను వాడతారు.  వైద్య శాస్త్రం ప్రకారం ఇవి శరీరంలో రోగ నిరోధన శక్తిని పెంచుతాయి.  వగరు రుచి కొత్త సవాళ్లకు సంకేతం.. కొత్త సంవత్సరంలో ఎదురయ్యే కొత్తమసవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు ఉగాది పచ్చడిలో లేత మామిడి పిందలను వాడతారు. 

ఉగాది రోజున అతి ముఖ్యమైన వంటకం అంటే ఉగాది పచ్చడి. దీనిని షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేస్తారు. ఈ షడ్రుచులను మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో జరిగే అన్ని రకాల భావనలను ఈ పచ్చడిలో ఇమిడి ఉంటాయి. ఇందులో వాడే ఒక్కో పదార్థం ఒక్కో భావానికి ప్రతీకలుగా ఉంటాయి. అందుకే ఉగాది రోజున అందరూ కచ్చితంగా షడ్రుచులు కలిసిన ఉగాది పచ్చడిని తింటారు.