ఫిబ్రవరి 3న వసంత పంచమి : మీ పిల్లలకు అక్షరాభ్యాసం ఏ సమయంలో.. ఎలా చేయాలో తెలుసుకోండి..!

ఫిబ్రవరి 3న వసంత పంచమి : మీ పిల్లలకు అక్షరాభ్యాసం ఏ సమయంలో.. ఎలా చేయాలో తెలుసుకోండి..!

మాఘమాసం మొదలైంది.  ఈ నెలలోనే చదువుల తల్లి సరస్వతి పుట్టిన రోజు .. ఈ ఏడాది వసంత పంచమి  ఫిబ్రవరి 3వ తేది వచ్చింది. ఆ రోజును వసంత పంచమి అంటారు.  హిందూ మతానికి చెందిన చదువుకునే పిల్లలు వసంతపంచమి రోజు సరస్వతి దేవిని పూజిస్తారు.  కొత్తగా చదువులోకి అడుగుపేట్టేవారికి ఆరోజు ( ఫిబ్రవరి 3) వతేదీన అక్షరాభ్యాసం చేయిస్తారు. 

ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్లపక్షం 5వ తిధిన వసంత పంచమి జరుపుకుంటాం. క్రోధినామ సంవత్సరంలో  వసంత పంచమి ( ఫిబ్రవరి 3) వతేదీన హిందువులందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. సరస్వతీదేవిని విశేషంగా పూజించి, ప్రత్యేకంగా నైవేద్యాలను సమర్పించి, పిల్లలకు విద్యాబుద్ధులు రావాలని, వారు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటారు.

ALSO READ | ఆధ్యాత్మికం: కర్మాచరణ... జ్ఞానం.....అంటే ఏమిటి? శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా ?

ధృక్​ పంచాంగం ప్రకారం ..  ఫిబ్రవరి 2 ఆదివారం మధ్యాహ్నం నుంచి పంచమి తిథి మొదలైంది.. ఫిబ్రవరి 3 సోమవారం ఉదయం 10.15 వరకు మాత్రమే ఉంది. సూర్యోదయానికి తిథి పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి..వసంతపంచమి ఫిబ్రవరి 3 సోమవారమే జరుపుకోవాలి. అక్షరాభ్యాసాలు నిర్వహించేవారు, ప్రత్యేక పూజలు చేసేవారు  ఫిబ్రవరి 3 వతేదిఉదయం పది గంటల లోపే ముగించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 

వసంత పంచమి రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే  విద్యాంతులు అవుతారని భక్తుల నమ్మకం.  అందుకే వసంత పంచమి ఘడియల్లో ( ఫిబ్రవరి 3) అక్షరాభ్యాసానికి ముహూర్తంతో సంబంధం లేకుండా  చూడకుండా అక్షరాభ్యాసాలు చేస్తారు. ఆరోజు సరస్వతి దేవి చదువుల తల్లి పుట్టిన రోజు కాబట్టి సరస్వతీ దేవి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. . ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తి...వీటి స్వరూపమే సరస్వతీదేవి. అమ్మ అనుగ్రహం ఉంటే సద్భుద్ధిని పొందుతారు