భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో విభిన్న సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని పండుగలు కామన్ గా ఉండగా... మరికొన్ని పండుగలు.. ఉత్సవాలు ఆయా ప్రాంత ఆచారాలను బట్టి జరుపుకుంటారు. త్రిపురలో ఏప్రిల్ 13న బిజూ పండుగను అత్యంత వైభవంగా మూడు రోజులు పాటు ఉత్సవాలను జరుపుకుంటారు. గతంలో ఈ పండుగను 15 రోజులు జరుపుకొనే వారు. త్రిపురలోని చక్మా కమ్యూనిటీ వారు జరుపుకునే బిజూ పండుగ బెంగాలీ కొత్త సంవత్సరం రోజున జరుపుకుంటారు. ఎన్నో వింత ఆచారాలను చక్మా కమ్యూనిటీ వారు పాటిస్తుంటారు.త్రిపురలోని చక్మా కమ్యూనిటి వారు జరుపుకొనే బిజూ పండుగ ఉత్సవాల గురించి తెలుసుకుందాం. . . .
బిజు పండుగను బెంగాలీ క్యాలెండర్ చివరి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం( 2024) బిజు ఉత్సవాన్ని త్రిపురలో ఏప్రిల్ 13 శనివారం జరుపుకుంటారు. ఈ పండుగను త్రిపురలోని ఏడు ఇతర జాతులు కూడా జరుపుకుంటారు మర్మా, టాంగ్‌చాంగ్యా, త్రిపురిస్, మ్రో, ఖుమి, ఖియాంగ్ , చక్మా. మర్మాలు పండుగను సంగ్రైగ్ అని పిలుస్తారు, టాంగ్‌చాంగ్యా దీనిని బిషూ అని పిలుస్తారు, ట్రూపిస్ దీనిని బైసుక్ అని పిలుస్తారు మరియు అహ్మియా దీనికి బిహు అని పేరు పెట్టారు. అది కాల క్రమేణ బిజూగా మారింది. చక్మా ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని తెలిపేందుకు దీనిని జరుపుకుంటారు.
మూడు రోజుల పాటు జరుపుకుంటారు, బిజు బెంగాలీ క్యాలెండర్ చివరి రోజున వస్తుంది. ఈ పండుగ వసంత ఋతువు ఆగమనం సమయంలో జరుపుకుంటారు. ఈ ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలలో ఈ పండుగ ఒకటి. ఈ పండుగను వేల సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జరుపుకుంటున్నారు. భారతదేశం , బంగ్లాదేశ్ ఈశాన్య భాగంలోని ప్రాంతాల్లో సాంస్కృతిక వారసత్వం సంప్రదాయంగా బిజూ ఉత్సవాలు నిర్వహిస్తారు.
పండుగ ప్రత్యేక సంప్రదాయాలు.. ఆచారాలను కలిగి ఉంటుంది. ఫూల్ బిజు అని పిలవబడే బిజూ మొదటి రోజున.. ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసి పూలతో అలంకరిస్తారు. సమీపంలోని నదులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముల్ బిజు అని పిలువబడే రెండవ రోజు సాంప్రదాయ పాటలు మరియు నృత్యాల ప్రదర్శనతో జరుపుకుంటారు, ఇది ప్రసిద్ధ బిజు నృత్యంతో ముగుస్తుంది. గోట్చే పోట్చే బిజు అని పిలువబడే మూడవ ... చివరి రోజున, సంఘంలోని పెద్దలు విస్తృతమైన విందుతో సత్కరిస్తారు. వారి జీవిత భాగస్వాములతో వారి వివాహ ప్రమాణాలను పునరుద్ధరించుకుంటారు. పండుగ ప్రధాన ఆకర్షణలలో ఒకటి ప్రత్యేక బిజు నృత్యం, పెర్కషన్ మరియు వేణువును కలిగి ఉండే సాంప్రదాయ సంగీత వాయిద్యాల లయలతో కూడి ఉంటుంది.
పూర్వం ఈ పండుగను పక్షం రోజుల పాటు జరుపుకునేవారు. అయితే మారుతున్న కాలంలో మూడు రోజుల పాటు జరుపుకుంటారు. బిజూ పండుగ కేవలం సాంస్కృతిక కార్యక్రమాలు మరియు సంప్రదాయాలకే పరిమితం కాదు. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు కలిసి శుభాకాంక్షలు మరియు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రోజున ( ఏప్రిల్ 13) , ప్రజలు ఒకరి ఇళ్లను ఒకరు సందర్శించి, స్వీట్లు మరియు పండ్లు ఇచ్చిపుచ్చుకుంటారు. రాబోయే సంవత్సరానికి శుభాకాంక్షలు అందజేస్తారు. పంట కాలం ముగిసి కొత్త వ్యవసాయ చక్రానికి నాంది పలుకుతున్న సందర్భంగా సమాజం అంతా ఒక్కతాటిపైకి వచ్చి జరుపుకునే బిజు పండుగ రోజున ప్రజలు గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతారు. కొత్త సంవత్సరాన్ని వైభవంగా స్వాగతిస్తారు. బిజూ అనేది వ్యవసాయ సీజన్‌లో మొదటి వర్షాల తర్వాత మొదటి పంటను జరుపుకునే వేడుక. పంటలు సమృద్ధిగా పండినందుకు రైతులు ఉత్సాహంగా జరుపుకుంటారు. అంతేకాదు పండేందుకు సహకరించిన ప్రకృతికి కృతజ్ఞతలు చెబుతారు.