Budda Purnima 2024: బుద్ద పూర్ణిమ ఎప్పుడు.. ఆరోజు ఏం చేయాలో తెలుసా...

Budda  Purnima 2024:  బుద్ద పూర్ణిమ ఎప్పుడు.. ఆరోజు ఏం చేయాలో తెలుసా...

వైశాఖ పౌర్ణమి.. బుద్ద పూర్ణిమ నాడు ఇంట్లో ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. పండితులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

వైశాఖ పౌర్ణమి రోజున దానం చెయ్యడం, స్వీకరించడం, పూజించడం వల్ల గొప్ప ఫలితాలు కలుగుతాయి. ఈ రోజును బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు. బౌద్ధులు ఈ రోజును పండుగగా జరుపుకుంటారు. వైశాఖ పౌర్ణమి మే 22వ తేదీ సాయంత్రం 5.42 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు మే 23వ తేదీ సాయంత్రం 6.42 గంటలకు ముగుస్తుంది. తిథి వ్రతం మే 23న మాత్రమే ఆచరిస్తారు.

ఈ రోజున బుద్ధుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ఫెంగ్ షుయ్ ప్రకారం, ఇది ఇంట్లో ఆనందం, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి కచ్చితంగా ఈ రోజున బుద్ధుని విగ్రహాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి.శక్తి యంత్రంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. కాబట్టి ఈ రోజున శక్తి యంత్రాన్ని కొని, ఇంట్లో ఉంచి పూజ చేయడం శుభప్రదం. అదేవిధంగా ఈ రోజున ఇత్తడితో చేసిన ఏనుగు విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల ఇంట్లో దారిద్ర్యం తొలగిపోయి, కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయని చెబుతారు.ఈ రోజు ఇంట్లో బంగారు లేదా వెండి నాణేలను ఉంచడం కూడా శుభప్రదంగా భావిస్తారు. తద్వారా లక్ష్మీదేవికి సంతోషం కలిగి, అనుగ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు.