చాతుర్మాసం నాలుగు నెలల పాటు ఉంటుంది. ఆషాడ శుద్ద ఏకాదశి ( జులై 17) దేవశయని ఏకాదశితో ప్రారంభమై కార్తీక మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి( నవంబర్12) అయిన దేవుత్థాన ఏకాదశితో ముగుస్తుంది. దేవశయని ఏకాదశి నుండి శ్రీ హరివిష్ణువు తన నాలుగు నెలల నిద్రను ప్రారంభిస్తాడని చెబుతారు. కార్తీక మాసంలోని దేవుత్థాని ఏకాదశి నాడు విష్ణువు నిద్ర నుంచి మేల్కొంటాడని చెప్తారు. ఈ సంవత్సరం చాతుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ నెలలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? అనే వివరాలు తెలుసుకుందాం.
ఆషాడ మాసం లోనే ఏకాదశి ( Ekadashi) నుండి కార్తీక మాసం లోనే ఏకాదశి వరకు ఉండే కాలాన్ని చాతుర్మాస కాలంగా పరిగణిస్తారు.ఈ చాతుర్మాస కాలంలో ( Chaturmasam )విష్ణువు నిద్రలోకి వెళ్లిపోతారు అని అందరూ నమ్ముతారు. ఈ సమయం సంవత్సరం లో దాదాపు నాలుగు నెలల పాటు ఉంటుంది.ఈ సంవత్సరం జూలై 17 నుండి ప్రారంభమవుతుంది. 12 నవంబర్ 2024న దేవుత్థాన ఏకాదశితో ముగుస్తుంది. ఈ కాలంలో విష్ణు మూర్తి నిద్ర యోగంలో ఉంటారని నాలుగు నెలల తర్వాత మేల్కొంటారని నమ్ముతారు.
చాతుర్మాసంలో విష్ణువు, లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధిస్తారు. ఉపవాసం ఆచరిస్తారు. పేదలకు, నిరుపేదలకు అన్నదానం, వస్త్రదానం, ధనదానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఈ సమయంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. తామసిక ఆహారాన్ని త్యజించాలి.ఈ సమయంలో సుందరా కాండ,భగవద్గీత లేదా రామాయణం పఠించడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుందని నమ్ముతారు. ఇది మాత్రమే కాకుండా విష్ణు సహస్రనామం పఠించడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి.
చాతుర్మాసంలో గోదానం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల భక్తులకు లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా నిలిచి ఉంటుందని విశ్వసిస్తారు. విష్ణుమూర్తికి తులసి అంటే మహా ప్రీతి. ఈ కాలంలో ప్రతిరోజూ తులసి మొక్కకు పూజ చేసి సాయంత్రం నెయ్యి దీపం వెలిగించాలి. చాతుర్మాస సమయంలో మంచంపై కాకుండా నేలపై పడుకోవాలి.చాతుర్మాసంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మీ దేవితో పాటు శివ-గౌరీ, వినాయకుడిని తప్పనిసరిగా క్రమపద్ధతిలో పూజించాలి. ఇక ఈ కాలం లో తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు సమర్పించాలి
చాతుర్మాస ఉత్సవాలు ( Chaturmasya festivals )సాధారణంగా ఆషాడ మాసంలో దేవశయన ఏకాదశి నాడు ప్రారంభమై కార్తీకమాసంలో ఉత్థాన ఏకాదశి నాడు ముగుస్తాయి.అయితే శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక నాలుగు మాసాలు చాతుర్మాస కాలాన్ని కలిగి ఉంటాయి.ఈ సమయంలో కొన్ని పనులు చేయడం నిషేధించబడింది.చాతుర్మాస కాలంలో మంచం మీద అస్సలు పడుకోకూడదు.
చాతుర్మాస కాలంలో శుభకార్యాలు అస్సలు చేయకూడదు.అలాగే కొన్ని ఆహారాలు కూడా తినకూడదు.అయితే పొరపాటున కూడా చేయకూడని పనులు చేస్తే కచ్చితంగా జీవితంపై చెడు ప్రభావం పడుతుంది.అయితే ఈ సమయంలో నూతన పనులు ప్రారంభించడం, ప్రారంభోత్సవాలు చేయడం, వివాహ వేడుకలు చేయడం, నిశ్చితార్థం చేసుకోవడం, పిల్లలకు నామకరణం చేయడం, గృహ ప్రవేశాలు చేయడం అస్సలు మంచిది కాదు.
ఇక చాతుర్మాస సమయంలో కొన్ని వస్తువులను తినడం నిషేధించబడుతుంది.అయితే ఈ కాలం లో మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు మొదలైనవి ఆహారంగా తీసుకోకూడదు.అలాగే ఈ కాలంలో కొత్త ఆస్తి కొనుగోలు లేదా గృహ ప్రవేశం చేయడం మానుకోవాలి. వివాహం, నిశ్చితార్థం సహా అన్ని శుభకార్యాలు చాతుర్మాస సమయంలో నిషేధించబడ్డాయి.ఈ నెలలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కూడా మానుకోవాలి. కోపం, ఇతరులను చూసి అసూయపడటం, అబద్ధాలు ఆడటం, అహంకారం వంటి భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. చాతుర్మాస సమయంలో జుట్టు, గడ్డం కత్తిరించడం నిషిద్ధంగా భావిస్తారు. ఇది మాత్రమే కాదు ఈ కాలంలో నూనె పదార్థాలు, పాలు, పంచదార, పెరుగు, నూనె, బెండకాయలు, పచ్చి ఆకు కూరలు, వెల్లుల్లి, పెసర పప్పు వంటి వాటికి దూరంగా ఉండాలి.