చాతుర్మాస వ్రతం: నవంబర్​12 వరకు ఎలాంటి పూజలు చేయాలి.. . నియమాలు.. ఫలితాలు ఇవే..

చాతుర్మాస వ్రతం:  నవంబర్​12  వరకు ఎలాంటి పూజలు చేయాలి.. . నియమాలు.. ఫలితాలు ఇవే..

హిందూ పంచాంగం ప్రకారం  చాతుర్మాస దీక్ష ప్రారంభమయింది.  జూన్​ 17నుంచి నాలుగు నెలల పాటు.. అంటే నవంబర్​ 12 వరకు    శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోఉంటారని  పురాణాలు చెబుతున్నాయి.  పురాణాల ప్రకారం ఈ కాలంలో  ఈ కాలంలో శుభకార్యాలను నిషేధిస్తారు.   దేవశయని ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్లిన శ్రీ మహా విష్ణువు, కార్తీక మాసంలో ఉద్దాన ఏకాదశి రోజున తిరిగి మేల్కొని, గరుడ వాహనంపై వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తాడని పండితులు చెబుతారు. ఈ మధ్య కాలంలో ఉండే ఆషాఢం, శ్రావణం, భాద్రపద, ఆశ్వయుజ మాసాలను ( 4 నెలలను)  కలిపి  చాతుర్మాసంగా చెబుతారు. ఈ సందర్భంగా చాతుర్మాస దీక్షను ఎవరు చేపట్టాలి.. ఈ వ్రతం ఎవరు చేయాలి.. ఈ వ్రత నియమాలేంటి.. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

చాతుర్మాస వ్రతం ఎప్పటివరకు

చాతుర్మాసంలో అంటే నాలుగు నెలల పాటు  నవంబర్ 12వ తేదీ వరకు ఎలాంటి శుభకార్యాలు చేపట్టరు. ఈ వ్రతం ఎన్నో యుగాలుగా ఆచరణలో ఉందని భవిష్య, స్కంద పురాణాల్లో పేర్కొనబడింది. ఈ వ్రతాన్ని ఆచరించే వారు ఊరి పొలిమేరలు దాటకూడదనే ఆచారం ఉంది. ఈ మాసం మానవ జీవనశైలిని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఆషాఢం నుంచి కార్తీక మాసం వరకు వాతావరణంలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. వర్షాలు అధికంగా కురవడం వల్ల నదులు, వంకలు, వాగులు పొంగుతూ నిండుగా ప్రవహిస్తుంటాయి. దీంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యల నివారణ కోసం ఊరి పొలిమేరను దాటకూడదని నియమాలున్నాయి. అందుకే ఈ కాలంలో ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు.

ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించాలంటే..

చాతుర్మాసం దీక్షను సాధారణంగా ప్రతి ఏడాది నాలుగు నెలల పాటు జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఏ మతం, ఏ కులానికి చెందిన వారైనా బ్రహ్మచారులు, సన్యాసులు, వివాహితులు చేయొచ్చు. ఈ వత్రాన్ని ఆచరించిన వారికి దేవుని అనుగ్రహం లభించి.. వారి కోరికలు తీరి.. ఉత్తమ గతులు కలుగుతాయని  భవిష్య పురాణంలో పేర్కొన్నారు.  అయితే ఈ వ్రతాన్ని నాలుగు నెలలు చేయలేని వాళ్లు రెండు నెలలు చేసుకోవచ్చు. ఇది కూడా సాధ్యం కాని వారు ఒక నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరించొచ్చు. అదీ కాదంటే వచ్చే ఐదు ఏకాదశుల నాడు వ్రతం చేస్తే మంచి ఫలితాలొస్తాయని నమ్ముతారు. అంతేకాదు జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ధన లాభం లభిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో కఠిన నియమాలున్న కారణంగా ఈ వ్రతం పీఠాధిపతులు, మఠాధిపతులకు మాత్రమే ఈ వ్రతం పరిమితమైంది.

ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించాలంటే..

చాతుర్మాసం దీక్షను సాధారణంగా ప్రతి ఏడాది నాలుగు నెలల పాటు జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఏ మతం, ఏ కులానికి చెందిన వారైనా బ్రహ్మచార్యులు, సన్యాసులు, వివాహితులు చేయొచ్చు. ఈ వత్రాన్ని ఆచరించిన వారికి దేవుని అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని చాలా మంది చెబుతారు. అయితే ఈ వ్రతాన్ని నాలుగు నెలలు చేయలేని వాళ్లు రెండు నెలలు చేసుకోవచ్చు. ఇది కూడా సాధ్యం కాని వారు ఒక నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరించొచ్చు. అదీ కాదంటే వచ్చే ఐదు ఏకాదశుల నాడు వ్రతం చేస్తే మంచి ఫలితాలొస్తాయని నమ్ముతారు. అంతేకాదు జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు, ఐశ్వర్యం, దన లాభం లభిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో కఠిన నియమాలున్న కారణంగా ఈ వ్రతం పీఠాధిపతులు, మఠాధిపతులకు మాత్రమే ఈ వ్రతం పరిమితమైంది.

ఈ దీక్షను ఎందుకు చేస్తారంటే..

ఈ నాలుగు నెలల కాలంలో ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చాతుర్మాస దీక్షను ఏర్పాటు చేసినట్లు పండితులు చెబుతారు. ఈ వ్రతాన్ని సన్యాసులు నాలుగు నెలల పాటు కఠిన నియమాలు పాటిస్తూ ఒకే చోట దీక్ష వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని చేసేవారు ప్రతిరోజూ తెల్లవారుజామునే స్నానం చేసి శ్రీ మహా విష్ణువు ఎదుట కూర్చుని పూజలు చేయాలి. ఈ కాలంలో మీరు ఏ పని చేసినా విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను, ఇష్టదేవతలకు సంబంధించిన మంత్రాలను పఠించాలి.

చాతుర్మాస వ్రతం నియమాలివే..

  •  చాతుర్మాసంలో లక్ష్మీనారాయణుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి.
  •  ఈ దీక్షను చేపట్టిన వారు బ్రహ్మచార్యాన్ని కొనసాగించాలి. నేలపైనే నిద్రించాలి.
  •  చాతుర్మాసంలో పెరుగు తినడం తగ్గించాలి లేదా మానేయాలి. ముఖ్యంగా రాత్రి వేళలో పెరుగు తినకూడదు.
  •  ఈ కాలంలో ఆకుకూరలు, కూరగాయలు తినకూడదు.
  •  రెండో నెలలో పెరుగు, మజ్జిగ తీసుకోరాదు. 
  •  మూడో నెలలు పాలు తీసుకోకూడదు.
  •  నాలుగో నెలలో పప్పు దినుసులు కూడా తీసుకోకూడదు.
  •  ఈ నాలుగు నెలల పాటు ఉల్లి, వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
  • మీ శక్తి సామర్థ్యాల మేరకు వస్త్రదానం, అన్నదానం, దీప దానం, శ్రమ దానం చేయాలి.

ఏయే ప్రయోజనాలంటే..

  • చాతుర్మాస వ్రతాన్ని ఆచరించిన వారికి శుభ ఫలితాలొస్తాయి.
  • మీ వ్యక్తిగత జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో విశేష ఫలితాలొస్తాయి.
  • దానధర్మాలు చేయడం వల్ల మీకు ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు అనేవే రావు.
  • మీరు చేసే పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఈ కాలంలో నిత్యం లక్ష్మీనారాయణులను పఠించడం వల్ల మీకు సకల పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు.

ఈ పనులు చేయకూడదు..

  •  చాతుర్మాస కాలంలో వివాహాలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడంతో పాటు తదితర 16 రకాల శుభ కార్యక్రమాలు నిషేధించబడ్డాయి.
  •  ఈ నాలుగు నెలల పాటు నీలం లేదా నలుపు రంగు దుస్తులు ధరించకూడదు.
  • చాతుర్మాసంలో మంచంపై నిద్రించకూడదు.
  •  ఈ నాలుగు నెలల పాటు ఎవరిపైనా కోపం, అహంకారం చూపకూడదు.
  •  ఈ నాలుగు నెలలు జుట్టు, గడ్డం కత్తిరించకూడదు.
  • చాతుర్మాసంలో తేనే, ముల్లంగి, బెండకాయ, ఆకుకూరలు తినకూడదు. వర్షాకాలంలో తేమ వల్ల వీటిలో కీటకాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని తినకూడదని పెద్దలు చెబుతారు.