పురాణాల ప్రకారం వైశాఖ శుద్ద సప్తమి రోజున గంగాదేవి భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. హిందూ మతంలో ఈ రోజుకి (మే 14) ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో గంగా సప్తమి రోజున తీసుకోవలసిన కొన్ని నియమ నిబంధనలు పేర్కొన్నాయి. ఈ పరిహారాలు చేయడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోయి ఇంటికి ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. గంగా సప్తమికి చేయాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం.
గంగా సప్తమి రోజు గంగాదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున గంగాదేవిని పూజిస్తారు. గంగా సప్తమి రోజున గంగాదేవి పునర్జన్మ పొందిందని మత విశ్వాసం. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్ష సప్తమి తిథి రోజుని గంగా సప్తమిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం (2024)లో గంగా సప్తమి పండుగను 14 మే 2024 మంగళవారం జరుపుకోనున్నారు.
గంగా సప్తమి తిథి:
ఈ నెల మే 14న వస్తుంది. మే 13న సాయంత్రం 5:20 గంటలకు సప్తమి తిథి ప్రారంభమై మే 14న సాయంత్రం 6:49 గంటలకు ముగుస్తుంది.కాబట్టి మే 14న జరుపుకుంటాం.
పురాణాల ప్రకారం వైశాఖ శుక్ల పక్షంలోని సప్తమి తిథి రోజున జాహ్నవి మహర్షి తన చెవి నుంచి గంగను విడుదల చేశాడు. ఈ కథ ప్రకారం గంగా సప్తమని జహ్న సప్తమి అని కూడా అంటారు. అదే సమయంలో కొన్ని పురాణ కథల ప్రకారం గంగాదేవిని జహ్న మహర్షి కుమార్తె జాన్వి అని కూడా పిలుస్తారు.
గంగాసప్తమి అంటే గంగాదేవి జన్మదినాన్నే గంగాసప్తమిగా జరుపుకుంటూ ఉంటాం. ఇదే రోజున గంగమ్మ బ్రహ్మ దేవుని కమండలం నుంచి ఉద్భవించిందట. కాబట్టి ఈ రోజుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ రోజున గంగమ్మను పూజిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయట. ఇక పెళ్లి కాని అమ్మాయిలకైతే తగిన వరుడు లభిస్తాడట. అసలు ఈ పండుగ ఎప్పుడు వస్తుంది? పూజ ఎలా చేయాలో చూద్దాం. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షంలో ఏడవ రోజున ఈ పండుగ వస్తుంది.
ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి గంగమ్మకు పూల మాలతో పాటు ఇంట్లో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ తరువాత గంగాదేవికి హారతి ఇవ్వాలి. ‘ఓం నమో గంగాయై విశ్వరూపిణీ నారాయణి నమో నమః గంగా గంగా’ అనే మంత్రాన్ని పఠిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. గంగా సహస్ర నామ స్తోత్రంతో పాటు గాయత్రీ మంత్రాన్ని సైతం పఠిస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు శివుడిని సైతం పూజిస్తారు. గంగానది ఒడ్డున అయితే పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోజున గంగానదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని నమ్మకం.
పూజా విధానం..
- ఈ రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర గంగానదిలో స్నానం చేయాలి.
- గంగాదేవికి మాల సమర్పించి స్వీట్లను నైవేద్యంగా పెట్టాలి.
- ఈ రోజున, పవిత్ర గంగానది ఒడ్డున జాతరలు నిర్వహిస్తారు.
- గంగా సప్తమి నాడు గంగా సహస్రనామ స్తోత్రం, గాయత్రీ మంత్రాన్ని పఠించడం శుభప్రదంగా చెబుతుంటారు
గంగా సప్తమి పూజా ఫలితం
వివాహం కోసం పరిహారాలు: వివాహం ఎవరికైనా ఆలస్యం అయితే గంగా సప్తమి రోజున.. గంగాజలంలో 5 బిల్వ పత్రాలు వేసి.. ఆ నీటితో భోలేనాథుడికి జలాభిషేకాన్ని ఆచారాల ప్రకారం చేయండి. ఇలా చేయడం వల్ల శివ, గంగలు ఇద్దరూ సంతోషంగా ఉంటారు. దీవెనలు ఇస్తారని నమ్ముతారు. అలాగే వివాహానికి అడ్డంకులు తొలగిపోయి కోరుకున్న జీవిత భాగస్వామి దొరుకుతుంది.
విజయానికి చిట్కాలు- మీరు ఏదైనా పనిలో పదేపదే విఫలమవుతూ జీవితంలో విజయం సాధించాలనుకుంటే, గంగా సప్తమి రోజున గంగలో పాలు పోసి, గంగామాత మంత్రాలను పద్దతిగా జపించండి. అలాగే గంగా తీరంలో కర్పూర దీపం వెలిగించి హారతిని ఇవ్వండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల జీవితంలో విజయం సాధిస్తారని నమ్ముతారు.
మోక్షాన్ని పొందే మార్గాలు- గంగా సప్తమి రోజున స్నానం, తపస్సు, ధ్యానం చేయండి. గంగాస్నానం చేయలేక పోతే ఇంట్లో గంగాజలాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేయండి. దీనితో పాటు మీ శక్తి ప్రకారం పేద ప్రజలకు బట్టలు, ఆహారాన్ని అందించండి. ఇది ముక్తికి దారితీస్తుందని నమ్ముతారు.