శ్రీరాముని గొప్ప భక్తుడైన హనుమంతుడిని ప్రజలు ప్రతి మంగళవారం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. ఇది కాకుండా కొన్ని ప్రత్యేక రోజుల్లో ఆ వాయు పుత్రుడ్ని పూజిస్తారు. ఇందులో హనుమాన్ జయంతి లేదా హనుమాన్ జన్మోత్సవ్ రోజు కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం చైత్ర పూర్ణిమ నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.
హనుమాన్ జయంతి ఎప్పుడు?
హిందూ పురాణాల ప్రకారం .. చైత్రమాసం పూర్ణిమ రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ ఏడాది 23 ఏప్రిల్ ఉదయం 03:25 గంటలకు పూర్ణిమ తిథి ప్రారంభమై ... 24 ఏప్రిల్ ఉదయం 05:18 గంటలకు ముగుస్తుంది. ఈ విధంగా ఉదయ తిథి ప్రకారం.. హనుమాన్ జయంతిని ఏప్రిల్ 23 మంగళవారం జరుపుకుంటారు. మంగళవారం, శనివారాలు హనుమంతుడికి అంకితం చేయబడినవి కాబట్టి, హనుమాన్ జయంతి మంగళవారం లేదా శనివారం వచ్చినప్పుడల్లా, దాని ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది.
హనుమాన్ జయంతి పూజకు శుభ సమయం
హనుమాన్ జయంతి నాడు.. ఆంజనేయుడికి పూజించడానికి 2 పవిత్రమైన సమయాలు ఉన్నాయి. హనుమాన్ జయంతి నాడు పూజకు మొదటి శుభ ముహూర్తం ఏప్రిల్ 23 ఉదయం 09:03 నుంచి మధ్యాహ్నం 01:58 వరకు, రెండవ శుభ సమయం ఏప్రిల్ 23వ తేదీ రాత్రి 08:14 నుంచి 09:35 వరకు ఉంటుంది.
హనుమాన్ జన్మోత్సవం.. జయంతి కాదు..
నిజానికి పురాణాల ప్రకారం.. హనుమాన్ జీ ఇప్పటికీ భూమిపై భౌతికంగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడు గంధమాదన్ పర్వతం మీద నివసిస్తున్నాడని నమ్ముతారు. అందుకే హనుమంతుడిని కలియుగ మేల్కొన్న దేవుడు అని పిలుస్తారు. మరణించిన వారి జన్మదినోత్సవం జరుపుకుంటారు. కానీ హనుమంతుడు ఇప్పటికీ భూమిపై ఉన్నారు. కాబట్టి అతని పుట్టినరోజును జన్మోత్సవం అని పిలవడం సరైనది. అందుకే చాలా మంది హనుమాన్ జయంతిని హనుమాన్ జన్మోత్సవంగా పిలుస్తారు.
హనుమాన్ జయంతి పూజా విధానం
హనుమాన్ జయంతి నాడు ఉదయాన్నే స్నానమాచరించి ఉపవాసం ఉండి పూజ చేయాలి. ఈ రోజున నారింజ లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించండి. అప్పుడు హనుమంతుడిని శుభ సమయంలో పూజించండి. దీని కోసం, ఈశాన్య దిశలో ఎర్రని వస్త్రాన్ని పరచి.. దానిపై హనుమంతుడు, శ్రీరాముని చిత్రాలను ఉంచాలి. ఆ అంజనీపుత్రునికి ఎరుపు పువ్వులు, రాముడికి పసుపు పువ్వులు సమర్పించండి. తర్వాత మల్లెపూల నూనె దీపం వెలిగించాలి. ఆ తర్వాత నైవేద్యం గా అప్పాలు సమర్పించాలి. ఆ తర్వాత హనుమంతుడు మంత్రం ‘ఓం హన్ హనుమతే నమః’ అని కూడా జపించండి. హనుమాన్ చాలీసా చదవండి. చివరగా హనుమాన్ జీకి హారతి చేసి, అందరికీ ప్రసాదం పంచండి.